Business Idea: కూటి కోసం కోటి విద్యలు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. కుటుంబాన్ని పోషించాలంటే ఏదోలా డబ్బులు సంపాదించుకోవాల్సిందే. చాలా మంది ఎలా డబ్బులు సంపాదించుకోవాలో తెలీక తికమక పడిపోతూ ఉంటారు. కొంత మంది వ్యాపారం చేయాలని ఉన్నా సరైన అవగాహన లేకపోవడంతో వెనకడుగు వేస్తుంటారు. అలా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఈ ఆర్టికల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
భారతదేశంలోని వంటగదిలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన దేశంలో పెద్ద మొత్తంలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈసుగంధ ద్రవ్యాల ద్వారా మసాలాలు తయారు చేసి అమ్మితే మంచి లాభాలు అర్జించవచ్చు. మీకు మీ ఏరియాలో సాధాణంగా ప్రజలు వాడే సుగంధ ద్రవ్యాల గురిచి తెలిసి ఉంటే చాలు మీకు విజయవంతంగా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు.

ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) నివేదికలో సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి పూర్తి బ్లూప్రింట్ తయారు చేశారు. ఈ నివేదిక ప్రకారం సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ.3.50 లక్షలు ఖర్చు అవుతుంది. ఇందులో 300 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్డు ఏర్పాటుకు రూ.60,000, పరికరాలు రూ.40,000. దీంతో పాటు ఇందుకోసం పనులు ప్రారంభించేందుకు అయ్యే ఖర్చుకు రూ.2.50 లక్షలు అవుతుంది.
మీ దగ్గర అంత మొత్తంలో వ్యాపారం ప్రారంభం చేసేందుకు డబ్బు లేకపోతే బ్యాంకు నుంచి రుణం కూడా తీసుకునే అవకాశం కలదు. ప్రధానమంత్రి ఉపాధి పథకం కింద ఈ వ్యాపారం కోసం రుణం తీసుకోవచ్చు. దీంతో పాటు ముద్ర లోన్ స్కీమ్ ద్వారా కూడా సహాయం తీసుకోవచ్చు. కెవిఐసి ప్రాజెక్టు నివేదిక ప్రకారం ఏటా 193 క్వింటాళ్ల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతాయి. ఇందులో క్వింటాకు రూ.5, 400 చొప్పున ఏడాదిలో మొత్తం రూ.10.42 లక్షలు సంపాదించుకునే అవకాశం కలదు. ఇందులో ఖర్చులన్నీ పోగా ఏడాదికి రూ.2.54 లక్షల లాభం వస్తుంది. అంటే నెలకు రూ.21 వేలకు పైగా సంపాదించుకోవచ్చు.