Sridevi Drama Company : మధ్యతరగతి కుటుంబం అంటేనే కష్టాల కడలి. ఆ కడలి దాటి ఒక గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్ని కన్నీళ్లను ఖర్చు చేయాలో.. ఎన్ని బాధలను మోయాలో.. ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ కామెడీ షోల్లో ఒకటైన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక బస్ కండక్టర్ తన డ్యాన్స్‌తో దుమ్మురేపిన విషయం తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆ అమ్మాయి డ్యాన్స్‌కి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో పడిందో లేదో అలా వైరల్ అయిపోయింది. లక్షల్లో వ్యూస్. తొలి 24 గంటల లోపే ఈ ప్రోమో 7 లక్షల వ్యూస్‌ని దాటేసింది. అంటే ఇక ఇప్పటికి ఆ వ్యూస్ ఎన్ని లక్షలు ఉండొచ్చో అంచనా వేయండి.
ఈ ప్రోమోని చూసిన నటిజన్లు కండక్టర్ డ్యాన్స్‌కు ఫిదా అయిపోయారు. ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ ఎపిసోడ్ ఆగస్టు 28 ఆదివారం 2022 మధ్యాహ్నం ఒంటి గంటకి ఈటీవీ ఛానల్‌లో ప్రీమియర్ చేయబడింది. ఇందులో ప్రత్యేకంగా ఆర్టీసీ కండక్టర్ అయిన ఝాన్సీ ప్రస్తుతం ట్రెండింగ్‌గా ఉన్న పల్సర్ బైక్ పాటకు వేసిన స్టెప్పులు ఆ షోకే హైలైట్‌గా నిలిచాయి. ఝాన్సీ మాస్ స్టెప్స్‌కి కమెడియన్స్ అందరూ ఉర్రూతలూగుతూ ఎంజాయ్ చేశారు. ఇక రష్మి గౌతమ్, ఆమని సైతం వెళ్లి ఝాన్సీతో కలిసి స్టెప్ కలిపారు. మొత్తానికి ఝాన్సీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
Sridevi Drama Company : కూతురు రోడ్డు మీద డ్యాన్స్ చేసి సంపాదిస్తుంటే తింటున్నారా?
అయితే ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రియల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. గతంలో ొక మూడు నెలల పాటు గంజి అన్నం, ఆవకాయ్ మాత్రమే తిని బతికాను అని ఝాన్సీ చెప్పుకొచ్చింది. పోలీస్ కానిస్టేబుల్ అయిన తన తండ్రి కుటుంబాన్ని రోడ్డున పడేసి వెళ్ళిపోతే తమ తల్లే తమను వదిలిపెట్టకుండా పాన్ షాప్ పెట్టుకుని, ఉల్లిపాయలు అమ్మి చదివించిందని చెప్పుకొచ్చింది. ఒకవైపు చదువుకుంటూనే డ్యాన్స్ చేస్తూ ఎన్నో ప్రైజ్‌లు గెలుచుకుంది. కూతురు రోడ్డు మీద డ్యాన్స్ చేసి సంపాదిస్తుంటే తింటున్నారా? అంటూ తన తల్లిని, తమ్ముడిని బంధువులు, చుట్టుపక్కల వారు హేళన చేసేవారని ఝాన్సీ వెల్లడించింది. ఇప్పుడు తన తమ్ముడిని ఎంబీఏ చదివించానని, హెచ్ఆర్ మేనేజర్‌గా చేస్తున్నాడని వెల్లడించింది.