తాజాగా పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన బన్నీ సాధారణంగా ఇలాంటి సాంగ్స్ చేసే హీరోయిన్స్ ఎన్నో నియమ నిబంధనలు పెడుతున్నారు కానీ సమంత అలాంటివి ఏమి లేకుండా ఈ సాంగ్ చేసింది మీరు దాన్ని స్క్రీన్ మీద చూడవచ్చు అని అన్నారు.దీంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ మొదలైంది
నాగచైతన్య,అక్కినేని ఫ్యామిలీ మీద గుర్రుగా ఉన్న సమంత వాళ్ల మీద రివెంజ్ తీర్చుకోవాలని ఈ సాంగ్ చేసిందని కొందరు అంటుంటే అక్కినేని అభిమానులు మాత్రం నాగచైతన్య,అక్కినేని కుటుంబం ఇలాంటి బోల్డ్ పాత్రలు,పాటలు చేయడానికి అంగీకరించకపోవడంతోనే సమంత చైతన్య నుండి డైవర్స్ తీసుకుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఉదంతం చూస్తున్న కొందరు సినీ విశ్లేషకులు విడాకులు తర్వాత తమ కెరియర్స్ పై దృష్టి సారించి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న వీరి వ్యవహారంపై ప్రజలు ఆసక్తి తగ్గిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.