Allu Arjun : స్టార్స్ జీవితాలు చాలా ఇబ్బందికరమే. మనలా హాయిగా రోడ్లపై విహరించలేరు. ప్రియురాలితో కలిసి పార్కుల చుట్టూ తిరగలేరు. ఒకవేళ అలా రోడ్డెక్కారో అటు మీడియా, ఇటు అభిమానులు వారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. అసలెందుకు బయటకు వచ్చాంరా బాబోయ్ అనేలా చేస్తారు. మరి వారికి ప్రైవేట్ లైఫ్ ఉండదా? అంటే స్వదేశంలో అంత సీన్ లేనట్టే అందుకే వేరే దేశానికి పయనమవుతుంటారు. మరి స్వదేశంలో తిరగాలంటే? ఏ అర్ధరాత్రో అపరాత్రో తిరగాల్సిందే తప్ప వేరే ఛాన్సే లేదు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అదే పని చేశాడు. తన భార్యతో కలిసి బయట విహరించాలనుకున్న మన ఐకాన్ స్టార్ తన కోరికను అర్ధరాత్రి నెరవేర్చుకున్నాడు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయిన మనోడికి దేశ విదేశాల్లోనూ అభిమానులు ఎక్కువే. వారి కంట పడకుండా.. మీడియాకు చిక్కకుండా బయటకు వెళ్లాలంటే చాలా కష్టం. అందుకే అల్లు అర్జున్ తన షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చి తన భార్య స్నేహ రెడ్డితో కలిసి హైదరాబాద్ సిటీలో సరదాగా లేట్ నైట్ రొమాంటిక్ డ్రైవ్‌కి వెళ్లాడు.
ఈ విషయాన్ని అల్లు అర్జునే రివీల్ చేశాడు. అంతేకాదు.. దీనికి సంబంధించిన వీడియోను సైతం పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక బన్నీ నటించిన పుష్ప సినిమా అన్ని భాషల్లోనూ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎంతలా అంటే ఒక్క హిందీలోనే ఏకంగా రూ.100 కోట్లని కలెక్ట్ చేసి బాలీవుడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. దీనిపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
Night Drive video of Icon Star #AlluArjun shared by wife Sneha Ma'am on Insta.#Pushpa #PushpaTheRule pic.twitter.com/fUL3zvPTQo
— Arjun (@ArjunVcOnline) November 8, 2022