కోవిడ్ కారణంగా ఈ ఏడాది సినిమాలు పెద్దగా థియేటర్స్ లో విడుదల అవ్వలేదు.ఇక ధైర్యం చేసి థియేటర్స్ కొచ్చిన సినిమాలలో మొదటి రోజు అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సినిమాలు ఏంటో వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
తొలిసారి పాన్ ఇండియా మూవీ చేసిన బన్నీ పుష్ప మూవీతో మొదటి రోజు 63 కోట్ల రూపాయలను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచారు.ఐదు భాషలలో విడుదల అవ్వాల్సిన ఈ మూవీ సాంకేతిక కారణాల వల్ల మలయాళంలో ఓ రోజు ఆలస్యంగా రిలీజ్ అయ్యింది అయినప్పటికీ పుష్ప మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది.ఇక 53 కోట్ల రూపాయలను రాబట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రెండవ స్థానంలో నిలిచింది.రజనీకాంత్ అన్నాత్తే 51 కోట్ల రూపాయిలతో ఈ లిస్ట్ లో మూడవ స్థానంలో నిలవగా,50 కోట్లతో విజయ్ మాస్టర్ మూవీ నాలుగవ స్థానంలో నిలిచింది.ఇక ఈ లిస్ట్ లో బాలీవుడ్ మూవీ సూర్యవంశీ ఐదో స్థానంలో నిలువగా బాలయ్య అఖండ మూవీతో 6వ స్థానంలో నిలిచారు.