పెళ్లి సమయాలలో అమ్మాయిలు మరింత అందంగా కనిపించడం కోసం బ్యూటీ పార్లర్ కి వెళ్లి భాగా ముస్తాబు అవుతారు. ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్ కి వెళ్లి అందానికి మెరుగులు దిద్దుకోవడం సర్వసాధారణంగా మారింది. పెళ్ళిళ్ళు, అలాగే ఇతర శుభకార్యాలలో మరింత అందంగా అందరి దృష్టిని ఆకర్షించాలని మగువలు వేల రూపాయిలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ లో తమ గ్లామర్ కి మెరుగులు దిద్దుకుంటారు. కొంతమంది ఎంత అందవిహీనంగా ఉన్నా కూడా ఈ బ్యూటీ మేకప్స్ తో అందంగా ఫోటో జెనిక్ గా కనిపిస్తారు. అందుకే మేకప్ ముందు పుట్టి ఆడవాళ్ళు తరువాత పుట్టారు అనే సామెత కూడా ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ పెళ్లి కూతురు బ్యూటీ పార్లర్ మీద కేసు పెట్టింది.
బ్యూటీ పార్లర్ వారు భారీగా డబ్బులు తీసుకొని తన అందాన్ని మెరుగుపరచాకపోగా మరింత చెడగొట్టి పంపించారని, దీనిపై ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించారని, పెళ్లి కూతురుతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జరిగింది. పెళ్ళికి ముందు రాధిక వధువు తన అందానికి మెరుగులు దిద్దుకోవడానికి మోనికా బ్యూటీ పార్లర్ కి వెళ్ళింది. అక్కడ ఆమెకి ఏకంగా 9 వేల రూపాయిల బిల్లు వేసారు.
అయితే అందం మెరుగవుతుంది అనుకుంటే ఉన్న అందాన్ని చెడగొట్టారని యువతితో పాటు ఆమె తల్లిదండ్రులు బ్యూటీ పార్లర్ నిర్వాహకులని ప్రశ్నించారు. అయితే దీనిపై వారు సమాధానం చెప్పకపోగా తిరిగి వారిపై దురుసుగా ప్రవర్తించి, అమర్యాదగా మాట్లాడారని యువతి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటన వార్తల్లోకి ఎక్కడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.