Breakfast tip: మనం రోజూ ఉదయాన్నే వివిధ రకాల బ్రేక్ ఫాస్ట్ చేసుకుంటుంటాం. ఇడ్లీ, పూరీ, దోశ, గారె, వడ, మైసూర్ బజ్జీ… ఇలాంటివి టిఫిన్ సెంటర్లలో కూడా విరివిగా లభిస్తాయి. మన ఇంట్లో అయితే గృహిణులు ఎక్కువగా ఇడ్లీలు, చపాతి, పూరీ లాంటివి చేస్తుంటారు. ముఖ్యంగా కరోనా సమయంలో టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు బాగా లాస్ అయ్యారు. అందరూ ఇళ్లలోనే చేసుకోవడం మొదలెట్టారు. ప్రస్తుతం అన్నీ సర్దుకున్నాయనుకోండి.. అది వేరే విషయం.
కరోనా బాగా వ్యాప్తిలో ఉన్నపుడు రీస్ విథర్ స్పూన్ తన ఇన్ స్టాలో ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ స్మూతీ గురించి వివరించింది. దాదాపు తొమ్మిదేళ్ల నుంచి రోజూ ఇదే తీసుకుంటున్నట్లు చెప్పింది. కూరగాయలు, పోషకాలతో పుష్టిగా ఉందని, అందుకే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ గా అభివర్ణించింది. మార్నింగ్ 10 నుంచి 11 గంటల్లోపు దీన్ని తాగితే మధ్యాహ్నం వరకు ఆకలి వేయదట.
గ్రీన్ స్మూతీ రెసిపీని కూడా తన ఇన్ స్టాలో వివరించింది. ఇందుకోసం 2 హెడ్స్ రొమైన్ పాలకూర, ఆఫ్ కప్ బచ్చలికూర, కొబ్బరి నీరు ఓ కప్పు, అరటి పండు ఒకటి, యాపిల్ ఒకటి, పియర్, నిమ్మకాయ, సెలెరీ కొద్దిగా, ఆల్మండ్ బటర్ ఉంటే మంచిది. ముందుగా పాలకూరను కట్ చేసి బ్లెండర్ లో వేసేలోగా కడిగి వడగట్టాలి. తర్వాత బచ్చలికూర, కొబ్బరినీళ్లు, అరటికాయ, యాపిల్, పియర్, నిమ్మకాయ్, ఇతర పదార్థాలనూ బ్లెండర్ లో వేయాలి. నిమ్మకాయ తొక్కు తీసేసి కోయాలి.
Breakfast tip:
అన్నింటినీ కలిపి మిక్సీలో ఓ రౌండ్ ఆడించాలి. మాంచి జ్యూస్ లా తయారయ్యాక ఓ గ్లాసులో కొన్ని ఐస్ ముక్కలేసి గ్రీన్ స్మూతీలో వేయండి. కొంచం సెలరీ, ఆల్మండ్ బటర్ ని కూడా కలుపుకుంటే టేస్ట్ అదిరిపోద్ది. ఇలా గ్రీన్ స్మూతీని చేసుకొని రోజూ తాగితే ఆరోగ్యం మీ సొంతమవుతుందని ఆమె తెలిపింది.