Naresh – Pavitra : సీనియర్ యాక్టర్ నరేష్, పవిత్రా లోకేష్‌కి చెడిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. అప్పట్లో ఎక్కడ పడితే అక్కడ జంటగా కనిపించిన వీరిద్దరూ ఈ మధ్య కనిపించడమే మానేశారు. సోషల్ మీడియాలో సైతం వీరిద్దరికీ సంబంధించిన పిక్స్ ఎన్నో వైరల్ అవుతూ ఉండేవి. కానీ ఏ పిక్ కూడా ఇప్పుడు లేదు.ఇటీవలే ఈ జంట మహాబలేశ్వరం టెంపుల్ లో పెళ్ళికి సంబంధించిన పనులను కూడా చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి.కానీ ఏమైందో ఏమో కానీ చప్పున చల్లారిపోయాయి.అసలు ఆ ఊసే లేదు. వారిద్దరూ కలిసి కనిపించడమే లేదు.
తనను నరేష్ కుటుంబం అంగీకరించిందని.. తమ సహజీవనానికి సైతం సూపర్ స్టార్ కృష్ణతో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ఫామ్ హౌస్‌లో అంతా కలిసే ఉంటున్నామని చెప్పిన పవిత్రా లోకేష్ ఎక్కడ? కనిపించదే? నరేష్ కుటుంబ ఫంక్షన్స్‌లో ఆయనతో పాటు పవిత్ర కూడా కనిపించింది. నరేష్‌తో పాటు షూటింగ్‌కు బెంగుళూరుకు సైతం వెళ్లి నరేష్ మూడవ భార్య రమ్యకు హోటల్ రూమ్‌లో వీరిద్దరూ అడ్డంగా దొరికిపోయారు. ఆ తరువాతే వారిద్దరూ పెద్దగా బయట పెద్దగా కనిపించింది లేదు. అయితే ఈ ఘటనే వారిద్దరి మధ్య చిచ్చు పెట్టిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నరేష్‌కి పవిత్రకి మధ్య ఏవో గొడవలు వచ్చాయని.. పవిత్ర వ్యవహార శైలి నచ్చక నరేష్ ఆమెను పక్కనబెట్టేశాడని టాక్. మరోవైపు ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. ఆ బెంగుళూరు ఘటన తరువాత పవిత్ర చాలా మనస్థాపానికి గురైందని.. దీనికి కారణం నరేష్ వ్యవహరించిన తీరేనని మరో టాక్ వినిబడుతోంది. ఏది ఏమైతేనేమి? ఎవరంటే ఎవరికి నచ్చలేదో కానీ.. ఈ జంట ఎంత ఫాస్ట్‌గా కలిశారో.. అంతే ఫాస్ట్‌గా విడిపోయారని సోషల్ మీడియా టాక్. మరి దీనిలో నిజమెంతో తెలియాలంటే ఎవరో ఒకరు పెదవి విప్పాలి.