Brain Health : మనం ఏం చేసినా అది మన మెదడు చేసే పనే. అంటే మన శరీరం ఏం పని చేసినా, ఏం ఆలోచించినా అది మెదడు ద్వారా లేదంటే మెదడు ఆదేశాల మేరకే జరుగుతుంది. మనిషి శరీరంలో ఎంతో కీలకమైన ఈ మెదడు ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడం ఎంతో అవసరం. ఈ ఆర్టికల్ లో మెదడు ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎలాంటి ఆహారాలు తినాలో తెలుసుకుందాం.
ఆకుకూరలు:
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని రకాల మూలకాలకు, పోషకాలకు నెలవుగా ఉండే ఆకుకూరలను తినాలని వైద్యులు చెబుతుంటారు. అవే ఆకుకూరలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడటాయి. ఆకుకూరల్లోని విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, ఈ, మెగ్నీషియంలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. వారానికి రెండు, మూడు సార్లు ఆకుకూరలు తినడం మంచిదని వైద్యులు సలహా ఇస్తుంటారు.
సాల్మన్, ట్యూనా ఫిష్ లు:
ఫ్యాటీ ఫిష్ తినే వారిలో మెదడు ఎంతో ఆరోగ్యంగా ఉంటుందట. కాబట్టి సాల్మన్, ట్యూనా, సార్డినెస్ లాంటి చేపలను తినడం మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. వీటిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంతో కీలకంగా వ్యవహరిస్తుంది.
అవకాడో:
అవకాడోలో ఎక్కువగా అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మన మెదడుకి చాలా మంచి చేస్తాయని వైద్యులు వివరిస్తుంటారు.
Brain Health : బ్రోకలి:
క్యాలీఫ్లవర్ లాగా అనిపించే కూరగాయ అయిన బ్రోకలి వల్ల మెదడు ఆరోగ్యం పదిలంగా ఉంటుందట. బ్రోకలిలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతుందట.