బాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మైథాలజీ ఎలిమెంట్ ని ప్రెజెంట్ కి కనెక్ట్ చేసి సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఈ మూవీని ఆవిష్కరించారు. ఇందులో అస్త్రాలని హీరోలుగా చూపించే ప్రయత్నం చేశారు. రణబీర్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఏకంగా 500 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. దంగల్ సినిమా తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్ లో కలెక్ట్ చేసిన చిత్రంగా బ్రహ్మాస్త్ర నిలిచింది.
అలియా భట్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించగా మౌనిరాయ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో కనిపించింది. అలాగే షారుఖ్ ఖాన్, నాగార్జున గెస్ట్ రోల్ లో మెరిశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సీక్వెల్ ని తీసుకొచ్చే పనిలో ప్రస్తుతం చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ ఉన్నాడు. భారీ బడ్జెట్ తోనే ఈ పార్ట్ 2 కూడా తెరకెక్కే అవకాశం ఉంది. ఇక బ్రహ్మాస్త్ర సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది. డిస్నీ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
నవంబర్ 4న అన్ని బాషలలో ఒకేసారి స్ట్రీమింగ్ కాబోతుంది. సిల్వర్ స్క్రీన్ పై ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఓటీటీలో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది అని భావిస్తున్నారు. కరణ్ జోహార్ కి ఈ మూవీ భారీ లాభాలు తెచ్చిపెట్టినట్లు తెలుస్తుంది. థియేటర్స్ లోనే ఈ మూవీ 500 కోట్ల వరకు కలెక్ట్ చేయగా, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కలుపుకొని మరో 100 కోట్లకి పైగా మూవీకి లాభాలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక రణబీర్ కపూర్ కెరియర్ లో కూడా ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.