బాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్ ఈ మూవీలో మెయిన్ లీడ్స్ చేయగా అమితాబచ్చన్ మరో కీలక పాత్రలో నటించారు. అలాగే షారుఖ్ ఖాన్, కింగ్ నాగార్జున గెస్ట్ రోల్స్ లో కనిపించారు. భారీ బడ్జెట్ తో కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ మూవీ డివైడ్ టాక్ తో మొదటి రోజు ఆట స్టార్ట్ చేసింది. తరువాత కంటెంట్ కంటే విజువల్ ఎఫెక్ట్స్ ఆడియన్స్ కి బాగా నచ్చాయి. బిగ్ స్క్రీన్ పై విజువల్ ఎఫెక్ట్స్ గ్రాండియర్ గా ఉండటంతో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
దానికి తోడు ఇండియన్ మైథలాజీ టచ్ ఉన్న అస్త్రాల నేపధ్యంలో కథ ఉండటంతో అందరికి చేరువ అయ్యింది. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల కలెక్షన్ కి చేరువ అయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ మూవీ డబల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అని చెప్పాలి. ఎలాంటి బజ్ లేకపోయిన తెలుగు రాష్ట్రాలలో ఊహించని స్థాయిలో భారీ కలెక్షన్స్ ని బ్రహ్మాస్త్ర మూవీ కొల్లగొట్టింది.
తెలుగులో మినిమమ్ రేంజ్ చిత్రాల స్థాయిలో బ్రహ్మాస్త్ర కలెక్షన్స్ ఉండటమే దీనికి నిదర్శనం. ఈ సినిమా ఇప్పటి వరకు ఏకంగా 24 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. అందులో థీయాట్రికల్ రైట్స్ తీసేస్తే 12 కోట్ల లాభాలు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక హిందీ నేపధ్యంఉండి తెలుగులో డబ్ అయిన సినిమాకి ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం మొదటి సారి అని చెప్పాలి. ఇక బ్రహ్మాస్త్ర పార్ట్ 2 మీద కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హైప్ క్రియేట్ అయ్యి ఉంది.