బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా బ్రహ్మాస్త్ర సినిమా ఉంది. ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకి మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చింది. విజువల్స్ పరంగా తెరపై అద్భుతంగా ఉన్నా కూడా కథ, కథనంలో దమ్ములేదని ప్రేక్షకులు తేల్చేశారు. దర్శకుడు అయాన్ విజువల్స్ ని గ్రాండియర్ గా ఆవిష్కరించడంపై పెట్టిన దృష్టి కథని నడిపించడంలో పెట్టలేదని మాట వినిపిస్తుంది. మరో వైపు ఈ సినిమాని బాయ్ కట్ చేయాలని సోషల్ మీడియాలో విస్తృతంగా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇలా డివైడ్ టాక్, నెగిటివ్ ప్రచారాల మధ్య బ్రహ్మాస్త్ర సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
విజువల్ వండర్ గా తెరపై నిండుగా కనిపించడంతో ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లి బ్రహ్మాస్త్ర చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టిస్తుంది. మూడు రోజుల్లో ఈ సినిమా రెండు వందల కోట్ల కలెక్షన్స్ రికార్డుకి దాటిపోయిందని తెలుస్తుంది. మొదటి రెండు రోజులు ఏకంగా 160 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆదివారం 43 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో రణబీర్ కెరియర్ లో అత్యంత వేగంగా 200 కోట్ల మార్క్ ని అందుకున్న చిత్రంగా బ్రహ్మాస్త్ర నిలిచింది అని బిటౌన్ లో వినిపిస్తున్న మాట. సినిమాకి ముందు వరకు కరణ్ జోహార్ బ్రహ్మాస్త్ర రిజల్ట్ విషయంలో చాలా టెన్షన్ పడ్డారు. అలాగే బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేదు.
ఇండస్ట్రీకి మరల ఒకప్పటి వేగం రావాలంటే బ్రహ్మాస్త్ర సక్సెస్ తోనే సాధ్యం అవుతుందని అందరూ భావించారు. అందుకు తగ్గట్లే ఈ సినిమా కలెక్షన్స్ బ్రహ్మాస్త్ర మూవీని బ్లాక్ బస్టర్ దిశగా తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇక వీకెండ్ అయిపోవడంతో ఇకపై రాబోయే కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది సినిమా సక్సెస్ రేట్ ని డిసైడ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి హైప్ తీసుకురావడం కోసం ఫేక్ కలెక్షన్స్ రికార్డుని చూపిస్తున్నారని కరణ్ జోహార్ వ్యతిరేకులు చెబుతున్న మాట. అందులో కంగనా రనౌత్ కూడా ఉండటం విశేషం. ఫేక్ కలెక్షన్స్ తో సినిమా ఫలితాన్ని మార్చలేరని కూడా విమర్శిస్తున్నారు. ఇప్పటికే థియేటర్స్ ఖాళీ అయిపోయానని, ఈ సినిమా కొన్న బయ్యర్లు నిండా మునిగిపోయారని అంటున్నారు. మరి ఈ రెండు వాదనలలో నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.