Brahmastra: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గత కొంతకాలం నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ వరుస ప్లాప్ సినిమాలను ఎదుర్కొంటూ సతమతమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది.
ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడంతో తెలుగులో కూడా పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ఈ సినిమాని తెలుగులో రాజమౌళి సమర్పణలో విడుదల చేశారు.ఇలా జక్కన్న ఈ సినిమాకు కీలక బాధ్యతలు తీసుకోవడంతో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని భావించారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమా విడుదలైన మొదటి వారం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను చూస్తే భారీగానే కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టగా ఒక ఇండియాలో మాత్రమే 200 కోట్లను రాబట్టినట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమా మొదటివారం పూర్తి చేసుకుని బారీ వసూలను రాబట్టడంతో ఈ విషయాన్ని నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ వేదికగా ఈ సినిమా కలెక్షన్ల గురించి తెలియజేశారు.
Brahmastra: ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్.
ప్రపంచవ్యాప్తంగా ప్రేమ వెలుగు కలిసి బాక్సాఫీస్ ను శాసిస్తున్నాయి.రెట్టింపు ఉత్సాహంతో రెండవ వారంలోకి ప్రవేశిస్తున్నాము అంటూ ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.ఇక ఈ సినిమా కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి కలెక్షన్లను రాబడుతుంది. తెలుగులో కూడా ఈ సినిమా విడుదలైన రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది. మొత్తానికి బ్రహ్మాస్త్ర సినిమా విజయంతో బాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుందని చెప్పాలి.