రామాయణం కథ ఆధారంగా ఆదిపురుష్ సినిమాని ఓం రౌత్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ టీజర్ కంటెంట్ అంతా రామాయణం కథ తరహాలోనే ఉన్న ఇప్పటి వరకు ఇండియన్ ఆడియన్స్ రామాయణం అనేసరికి రాముడు నిర్మలమైన ముఖారవిందంతో ఉంటాడు. రావణుడు తలపై కిరీటం పెట్టుకొని శివ భక్తుడుగా కనిపిస్తాడు. ఆంజనేయుడు రాముడు మీద భక్తి భావంతో తిరుగుతూ కనిపిస్తాడు. ఇక లక్షణుడు రాముడి విధేయుడుగా అన్న పక్కనే ఉంటాడు అనే తరహా మైండ్ సెట్ కి గత సినిమాలు, సీరియల్స్ తీసుకొచ్చాయి. ఇప్పటికి హిందువులు అందరూ రాముడిని అలా చూడటానికే ఇష్టపడతారు. రావణుడు రాక్షసరాజు అయినా కూడా మనిషి రూపంలో చూస్తారు.
ఆంజనేయుడు వానరుడు అయినా కూడా మనిషి రూపంలోనే కనిపించాలి. ఇంకా ఏ రూపాలలో కనిపించిన ఇండియన్ ప్రేక్షకులు డైజిస్ట్ చేసుకోలేరని ఆదిపురుష్ టీజర్ తో అర్ధమైంది. ఓం రౌత్ సరికొత్తగా క్యారెక్టరైజేషన్స్ ని తాను రామాయణాన్ని అర్ధం చేసుకున్న పద్ధతిలో రాక్షసులని క్రూరమైన జంతువులుగా, వానరసైన్యాన్ని కోతుల గుంపుగా, రామ, లక్ష్మణులని మాత్రమే మనుషులుగా చూపించి ప్రేక్షకులకి సరికొత్త అనుభూతి అందించాలని అనుకున్నారు. అయితే టీజర్ తోనే ఈ ప్రయత్నం బెడిసికొట్టినట్లు సోషల్ మీడియాలో ఈ మూవీపై ట్రెండ్ అవుతున్న నెగిటివ్ కామెంట్స్, మీమ్స్, ట్రోల్స్ చూస్తూ ఉంటే అర్ధమవుతుంది. దర్శకుడి దృక్కోణం ఏంటో అర్ధం చేసుకోకుండా అప్పుడే సినిమాని బాయ్ కట్ ఆదిపురుష్ అంటూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.
సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ కాస్తా వీక్ గా ఉన్న మాట వాస్తవమే అయినా కంటెంట్ ని, దర్శకుడి ఐడియాలజీ ఏంటి అనేది అర్ధం చేసుకోకుండా ఇలా నెగిటివ్ ప్రచారానికి తెరతీయడం ఎంత వరకు కరెక్ట్ అనే మాట వినిపిస్తుంది. ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడానికి కారణంగా సైఫ్ అలీ ఖాన్ ని చూపిస్తున్నారు. కేవలం అతను ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాడు కావడం, సినిమాలో రావణుడి పాత్రలో నటించడం, అది కూడా బ్రాహ్మణత్వం కనిపించకుండా క్రూరుడుగా టీజర్ లో కనిపించడం ఒక వర్గం వారిని డిజప్పాయింట్ చేసింది. దీంతో రామాయణాన్ని ఆదిపురుష్ మూవీతో వక్రీకరించి ప్రయత్నం జరుగుతుందనే కొత్త పల్లవి తెరపైకి తీసుకొచ్చారు. ఆదిపురుష్ ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ నెగిటివ్ ప్రచారంపై ఆదిపురుష్ టీమ్ గాని దర్శకుడు ఓం రౌత్ గాని స్పందించే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి.