BIGG BOSS: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో నాలుగవ వారం నామినేషన్స్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మూడు వారాల పాటు జరిగిన పరిణామాల నేపధ్యంలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎక్కువగా ఇద్దరినే టార్గెట్ చేస్తూ నామినేట్ చేస్తున్నట్లు కనిపించింది. ఆ ఇద్దరిలో ఒకరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవగా, మరొకరు యావరేజ్ కంటెస్టెంట్ అనే చెప్పవచ్చు. ఇంతకీ ఎవరా ఇద్దరు కంటెస్టెంట్స్ అనుకుంటున్నారా… అక్కడికే వస్తున్నా…! సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ ఇలా సాగింది.
ముందుగా శ్రీహాన్ తో నామినేషన్ ప్రక్రియ మొదలు అవుతుంది. రాజ్, ఇనయను శ్రీహాన్ నామినేట్ చేస్తాడు. తర్వాత సుదీప తన వంతు వచ్చినప్పుడు ఇనయ, రేవంత్ ని నామినేట్ చేస్తుంది. ఇక గీతూ తనకు అవకాశాన్ని ఉపయోగించుకుంటూ చంటి, ఇనయను నామినేట్ చేస్తుంది. ఇక రేవంత్, సూర్యను వాసంతి నామినేట్ చేస్తుంది. తర్వాత చాలా కోపంతో రేవంత్ ని ఆరోహి నామినేట్ చేసింది. ఇనయను కూడా ఆరోహి నామినేట్ చేస్తుంది. ఇనయ, రేవంత్ ని నామినేట్ చేస్తుంది శ్రీసత్య. తర్వాత బాలాదిత్య తనదైన శైలిలో కారణాలు వివరిస్తూ సూర్య, రేవంత్ ని నామినేట్ చేస్తాడు.

ఇక ఇనయకి ఛాన్స్ రాగానే సుదీప, శ్రీహాన్ ని నామినేట్ చేస్తుంది. తర్వాత ఎప్పటిలాగానే సున్నితమైన కారణాలు చెబుతూ గీతూ, ఇనయను నామినేట్ చేశాడు. అర్జున్ తన ఛాన్స్ వచ్చినప్పుడు రాజ్, గీతూని నామినేట్ చేస్తాడు. వాసంతి, ఇనయను సూర్య నామినేట్ చేసింది. ఇక ఎంతో ఉత్సాహంతో రేవంత్.. శ్రీసత్య, ఆరోహిని నామినేట్ చేశాడు. శ్రీహాన్, ఆరోహిని రాజ్ నామినేట్ చేశాడు. మెరీన జంట సూర్య, ఇనయని నామినేట్ చేస్తారు. తర్వాత కీర్తి తన ఛాన్స్ రాగానే ఇనయ, రేవంత్ ని నామినేట్ చేస్తుంది. ఆరోహి, సుదీపని నామినేట్ చేస్తుంది ఫైమా.
ఇక కెప్టెన్ ఆదిరెడ్డి తనదైన శైలిలో వివరిస్తూ ఆరోహినిని నామినేట్ చేస్తాడు. ఆరోహితో పాటు సదీపను నామినేట్ చేశాడు. దీంతో ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి రాజ్, ఇనయ, రేవంత్, , శ్రీహాన్, సుదీప, సూర్య, ఆరోహి, గీతూ వీరితో పాటు హోస్ట్ ద్వారా నేరుగా నామినేట్ అయిన అర్జున్, కీర్తి ఎలిమినేషన్ కి నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటిస్తాడు. సో మొత్తం ఎపిసోడ్ లో ఎక్కువగా ఇనయ, రేవంత్ హౌస్ సభ్యుల చేత నామినేట్ అయ్యారు. వారిద్దరి టార్గెట్ గానే సోమవారం నామినేషన్ల ప్రక్రియ సాగింది.