Boney Kapoor: సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని భాషతో సంబంధం లేకుండా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దివంగత నటి శ్రీదేవి గురించి పరిచయం అవసరం లేదు. ఈమె సౌత్ ఇండస్ట్రీలోనూ, నార్త్ ఇండస్ట్రీలోనూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న ఈమె ప్రొడ్యూసర్ బోనీకపూర్ ను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా బోనికపూర్ శ్రీదేవి దంపతులకు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ అనే ఇద్దరు అమ్మాయిలు కలరు. ఇక శ్రీదేవి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.బోని కపూర్ సైతం నిర్మాతగా ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు.
ఇలా ఇండస్ట్రీలో కూతుర్లు నటీమణులుగా తండ్రి ప్రొడ్యూసర్ గా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బోనీ కపూర్ తన కూతుర్లను మాత్రం ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోతున్నారు. ఈయన తలుచుకుంటే తన కూతుర్లను వెంటనే సౌత్ ఇండస్ట్రీకి పరిచయం చేయవచ్చు అయితే బోనికపూర్ ఇప్పటికే టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన తన కూతుర్లను మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోతున్నారు.
Boney Kapoor: టాలీవుడ్ రేంజ్ కు బోనీ కపూర్ కూతుర్లు ఎదగలేదా..
ఒకానొక సమయంలో బాలీవుడ్ తారలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటించాలంటే ఎంతో కష్టతరంగా ఉండేది.అయితే అప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ పొజిషన్లో ఉండటం వల్ల వాళ్లు తెలుగు సినిమాలలో నటించడానికి ఇష్టపడేవారు కాదు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సౌత్ సినీ పరిశ్రమ ఎంతో అద్భుతంగా ముందుకు కొనసాగుతుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ఈయన మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీకి తన కూతుర్లను పరిచయం చేయలేకపోతున్నారు. సౌత్ ఇండియా తెలుగు సినిమాలకు అద్భుతమైన నటీమణులు అవసరం ఉన్న నేపథ్యంలో ఇతర హీరోయిన్లను ఎంపికచేసుకోవడం వల్లే ఇలా అవకాశాలు రాలేదని ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.మరి ఈయన ఎప్పుడు తన కూతుర్లను టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తారో వేచి చూడాలి.