సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. పూజా హెగ్డే ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెతో పాటు సంయుక్త మీనన్ కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా స్టోరీపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ తనకి అలవాటైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోనే మళ్ళీ వస్తున్నాడనే టాక్ ఉంది. అలాగే సరికొత్త కథతో యాక్షన్ ఎంటర్టైనర్ కథతో మహేష్ బాబుని సరికొత్తగా ప్రెజెంట్ చేయడానికి త్రివిక్రమ్ రెడీ అయ్యారనే మాట కూడా వినిపిస్తుంది.
అయితే ఇందులో ఏది వాస్తవం అనేది తెలియదు. కాకుంటే ఈ మూవీలో మహేష్ బాబు గెడ్డంతో కనిపిస్తాడని అతని లుక్స్ బట్టి తెలుస్తుంది. ఎన్నడూ లేని విధంగా గడ్డం, లైట్ గా మీసంతో త్రివిక్రమ్ మహేష్ బాబుని ఈ మూవీలో చూపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీపై తాజాగా మరో ఆసక్తికరమైన అప్డేట్ కూడా బయటకొచ్చింది. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిప్రజెంట్ చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నారని అందులో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోని విలన్ పాత్ర కోసం ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ తో ఇప్పటికే త్రివిక్రమ్ సంప్రదింపులు జరిపారని, ఆయన కూడా నటించడానికి ఒకే చెప్పారని టాక్. ఒక వేళ సైఫ్ గాని ఈ మూవీలో నటిస్తే అది కచ్చితంగా ఇండియన్ వైడ్ గా మంచి హైప్ క్రియేట్ చేసే న్యూస్ అవుతుంది. అలాగే మహేష్ బాబుకి కూడా బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.