Bollywood : ఒకప్పుడు హీరోయిన్ లు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయితే చాలు వారుసపెట్టి 20 , 30 సినిమాల వరకూ చేసి ఫ్యాన్స్‌ను అలరించేవారు . తమ నటనతో అందంతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకునేవారు. ఇలాంటి హీరోయిన్‌లు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఉన్నారు. కానీ నేడు ఒకటి రెండు లేదా 5 సినిమాలకే పరిమితమై ఫేడౌట్ అవుతున్న స్టార్లు చాలామందే ఉన్నారు.

Bollywood : అలనాటి హీరోయిన్‌లు పెళ్లిల్లై, పిల్లలు పుట్టిన తరువాత మరోసారి వారి హవాను ఇండస్ట్రీలో చూపేందుకు సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. క్రేజీ ప్రాజెక్టులతో ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీలు సోనాలి బింద్రే, కాజోల్ లు తమ అప్ కమింగ్ ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతూనే మూవీ ప్రమోషన్‌లలో ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ కనువిందు చేస్తున్నారు.మమ్మీలైనా అందాలతో సునామీని సృష్టిస్తున్నారు.

బాలీవుడ్ ఆల్‌టైమ్ ఫేవరేట్ హీరోయిన్ కాజోల్ త్వరలో బిగ్ స్క్రీన్ పైన విడుదల కాబోతున్న సలామ్ వెంకీ చిత్రం ప్రమోషన్‌లతో బిజీ బిజీగా ఉంది. డిసెంబర్ 9 న ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రమోషన్ కోసం ఈ బ్యూటీ అందమైన లెహంగా సెట్ వేసుకుని దేశీ లుక్‌లో అదరగొట్టింది. మెరూన్ కలర్ లెహంగా వేసుకుని దానికి జోడీగా మొఘల్ ఆర్కిటెక్చర్‌ని తలపించేలా ఎంబ్రాయిడరీ ఫ్లోరల్ డిజైన్స్ వి నెక్ లైన్ కలిగిన మెరూన్ కలర్ సాటిన్ సిల్క్ బ్లౌజ్‌ను ధరించింది. షీర్ దుపట్టాను భుజాల మీదుగా వేసుకుని తన అందాలతో మెస్మరైజ్ చేసింది.

ఈ బ్రైట్ కలర్ అవుట్‌ఫిట్ మరింతగా ఎలివేట్ అయ్యేందుకు కాజోలు ధగధగా మెరిసేటి వజ్రాల ఆభరణాలను ధరించింది. మెడలో డైమండ్స్, ఎమెరాల్డ్ తో డిజైన్ చేసిన క్యూరియో కాటేజ్ అనే జ్యువెల్లరీ బ్రాండ్ నుంచి సేకరించిన అందమైన స్టేట్మెంట్ చోకర్ నెక్‌లెస్ పెట్టుకుంది. చేతికి వజ్రాల గాజులను అలంకరించుకుంది. సింపుల్ మేకప్‌తో పెదాలకు పింక్ కలర్ న్యూడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని ఈ అవుట్‌ఫితో హాట్ ఫోటో షూట్ చేసింది కాజోల్. ఈ ఫోటో షూట్ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అందరిని మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

గత కొంత కాలం నుంచి సోనాలీ బింద్రే సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. అదిరిపోయే అవుట్‌పిట్స్‌ను ధరించి ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫోటో షూట్ ద్వారా ట్రెడిషనల్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తోంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అబు జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన ఆకుపచ్చని చీరకట్టుకుని అందరి చూపును తనవైపు తిప్పుకుంది. వివిధ అలంకరణలతో వచ్చిన ఈ చీర సోనాలీకి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యింది.

చీరకట్టుకు తగ్గట్లుగానే సోనాలీ కనులకు బోల్డ్ స్మోకీ ఐ ష్యాడోను వేసుకుంది. పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని అదరగొట్టింది. చెవులకు బంగారు జుంకాలు, చేతికి గాజులు, చేతి వేళ్లకు ఉంగరాలను అలంకరించుకుంది. ఈ లుక్ లో దిగిక పిక్స్‌ను సోనాలీ తన ఇన్‌స్టా ప్రొఫైల్‌లో షేర్ చేసింది. అలా షేర్ చేసిందో లేదో లైకులు షేర్ల వర్షం కురిసింది. సూపర్ గ్లామరస్ అంటూ ఫ్యాన్స్ ఇన్‌బాక్స్‌లో మెసేజ్‌లు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.
