బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత మంది స్టార్ హీరోల చేతిలో బందీ అయిపోయిందని చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటారు. అలాగే వారసత్వంతో వచ్చే హీరోలకి మాత్రమే బాలీవుడ్ లో అవకాశాలు వస్తాయని, కొత్త వారు రాణించలేరని కూడా అంటూ ఉంటారు. ఇక గత కొన్నేళ్లుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ చాలా గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటుంది. స్టార్ హీరోల నుంచి సరైన హిట్స్ రావడం లేదు. చిన్న చిన్న చిత్రాలు మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. అయితే అయితే దర్శకులు మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోల కారణంగానే వారికి హిట్స్ రావడం లేదని, మంచి కథలని వారు ప్రోత్సహించడం లేదనే విమర్శలు చేస్తున్నారు.
చాలా మంది దర్శకులు ఈ కోవలోకి చేరుతున్నారు. తాజాగా స్టార్ దర్శకుడు ప్రకాష్ ఝా కూడా స్టార్ హీరోలపై అలాంటి ఆరోపణలే చేశారు. దర్శకుడిగా నటుడిగా ఆయన చేసిన మత్తో కి సైకిల్ అనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ అగ్ర హీరోలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బిటౌన్ లో సంచలనంగా మారాయి. స్టార్ హీరోలతో ఎందుకు సినిమా తెరకెక్కించడం లేదని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెబుతూ స్టార్ హీరోలు అందరూ పాన్ మసాల యాడ్స్ చేసుకోవడంలో బిజీ అయిపోయారు అంటూ విమర్శలు చేశారు.
పాన్ మసాల యాడ్ చేస్తే సాయంత్రానికి వారి అకౌంట్ లో 50 కోట్లు క్రెడిట్ అయిపోతాయి. ఇంకా కొత్త కథలతో సినిమాలు చేయడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తారంటూ సెటైర్ వేశారు. పాన్ మసాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అనే విషయం తెలిసిన వారికి కావాల్సింది డబ్బు కాబట్టి ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలాగే వారు కథలు వినడానికే ఆసక్తి చూపించకపోతే కంటెంట్ ఉన్న సినిమాలు ఇంకెలా వస్తాయని విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రకాష్ ఝా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి. అవి నేరుగా పాన్ మసాల యాడ్స్ చేసే హీరోలు అందరికి తాకడం విశేషం. మరి ప్రకాష్ ఝా వాఖ్యలపై సదరు స్టార్ హీరోలు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.