Ranaveer Singh : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. బాడీగార్డ్ ఆయన చెంపను చెల్లుమనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే కావాలని రణవీర్‌ను బాడీగార్డ్ చెంప మీద కొట్టలేదు కానీ అలా జరిగిపోయింది. దీని తాలుకూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2022 (SIIMA 2022) వేడుకలకు రణ్‌వీర్ హాజరయ్యారు. వైట్ డ్రెస్‌లో స్టైలిష్ లుక్‌లో సందడి చేశారు. మోస్ట్ పాపులర్ హిందీ యాక్టర్ అవార్డును అందుకున్న రణ్‌వీర్.. బయటకు వచ్చే సమయంలో అభిమానులు అందరూ ఒక్కసారిగా ఆయనను కలిసేందుకు ఎగబడ్డారు.
రణవీర్ సింగ్‌తో సెల్ఫీ ఫొటో తీసుకునేందుకు పోటీలు పడ్డారు. వారి నుంచి రక్షించేందుకు ఆయన బాడీ గార్డులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో అనుకోకుండా ఓ బాడీగార్డు రణ్‌వీర్ చెంపపై గట్టిగా కొట్టాడు. దీంతో అవాక్కైన రణవీర్ చెంపపై చేయి పెట్టుకుని కాసేపు అలాగే ఉండిపోయాడు. ఎంతో స్పోర్టివ్‌గా తీసుకున్న రణ్‌వీర్ అతడిని ఏమి అనకుండా.. చెంపను పట్టుకోవడం వీడియోలో కనిపించింది. ఆ తర్వాత నవ్వుతూ అభిమానులతో సెల్ఫీలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Ranaveer Singh : రకరకాల కామెంట్లతో ఏకి పారేసిన నెటిజన్లు
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కొద్ది రోజుల క్రితం కూడా హాట్ టాపిక్ అయ్యారు. హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోగా రాణిస్తున్న రణ్‌వీర్ సింగ్ తాజాగా ఒంటిపై నూలు పోగు లేకుడా ఫోటో షూట్ చేసి సంచలనం రేపారు. ఇటీవలి కాలంలో రణ్ వీర్ తప్ప ఇలాంటి రిస్క్ తీసుకున్న మరో హీరో అయితే లేడు. అయితే ఇలాంటి చర్యకు పాల్పడిన రణ్‌వీర్ సింగ్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లతో ఏకి పారేశారు.అంతర్జాతీయంగా గొప్పపేరున్న కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం హీరో రణ్‌వీర్ సింగ్ ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటో ఫోజ్ ఇచ్చాడు.70వ దశకంలో పాప్ ఐకాన్ బర్ట్ రేనేల్డ్స్ ఈ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసి అప్పట్లో సంచలనం రేపాడు. బర్ట్ రేనేడ్స్ కు నివాళులర్పిచేందు కోసం రణ్ వీర్ సింగ్ ను కాస్మోపాలిటన్ మ్యాగజైన్ ఒప్పించింది.
Oops! Who slapped him?#RanveerSingh #slapped #Viral pic.twitter.com/0jzekvpOMr
— Payal Mohindra (@payal_mohindra) September 13, 2022