బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన సినిమాలు తెలుగులో విడుదల కాకపోయిన ‘అర్జున్ రెడ్డి’, ‘జెర్సీ’ వంటి సినిమాలను హిందీలో రీమేక్ చేయడంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.
షాహిద్ కపూర్ తన OTT తొలి సిరీస్ ఫర్జీతో ప్రేక్షకులను అలరించాడు. అతను జియో సినిమా లో OTT విడుదలను ఎంచుకున్న బ్లడీ డాడీ చిత్రంలో నటించనున్నాడు. ఇటీవల విడుదలైన ఈ నటుడి ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ అభిమానులను అలరించింది.

లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే బ్లడీ డాడీ ట్రైలర్ రేపు రానుంది. OTT ప్లాట్‌ఫారమ్ కొద్దిసేపటి క్రితం ట్రైలర్ అప్‌డేట్‌ను షేర్ చేసింది. సుల్తాన్, టైగర్ జిందా హై వంటి చిత్రాలతో ఫేమస్ అయిన అలీ అబ్బాస్ జాఫర్ బ్లడీ డాడీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా మొత్తం హీరో నెరేటీవ్‌లోనే సాగుతుందట. అంతేకాకుండా ఒక్క రాత్రిలోనే సినిమా మొత్తం కథ జరుగుతుందట. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నేరుగా జియో సినిమా ఓటీటీలో జూన్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జ్యోతి దేశ్‌పాండే, సునీల్ ఖేతర్‌పాల్ ఈ సినిమాను నిర్మించారు.