Blood Oxygen: రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడం అనేది అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. కరోనా సమయంలో ఎక్కువ మంది తమ రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని తక్కువగా కలిగి ఉన్నారు. దీని వల్ల జీవిక్రియలు నెమ్మదిస్తాయి. మనిషి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపే రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుకోవడానికి ఏఏ పండ్లు తినాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
నిమ్మకాయ:
భారతీయ వంటకాల్లో తరుచుగా వాడే నిమ్మకాయ వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. నిజానికి నిమ్మకాయ అనేది ఆక్సిజన్ ఆధారిత ఆహారం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం ఎంతో సులభంగా పెరుగుతుంది.
పైనాపిల్, ఎండుద్రాక్ష, బేరి పండ్లు:
రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్న వారు తమ డైట్ లో ఖచ్చితంగా పైనాపిల్, ఎండుద్రాక్ష, బేరి పండ్లను చేర్చుకోవాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. ఈ ఆహారాల్లో pH స్థాయి 8.5 ఉంటుంది. అలాగే ఈ పంట్లలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
Blood Oxygen: మామిడి:
ఎండాకాలంలో వచ్చే పండ్లు అయిన మామిడి పండ్లను తినడం వల్ల కూడా రక్తంలో ఆక్సిజన్ శాతం మెరుగవుతుంది.
బొప్పాయి:
ప్రతి రోజు ఆహారంలో బొప్పాయిని తీసుకునే వారికి రక్తంలో ఆక్సిజన్ కొరత సమస్య ఉండదు.