Blood Levels: పండ్ల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లను తీసుకోవడం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తుంటారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికీ ఫ్రూట్స్‌ను తరచూ తీసుకుంటూనే ఉండాలని వాళ్లు చెబుతుంటారు. మనం తినే రోజువారీ ఆహారంలో పండ్లు తీసుకోవడాన్ని చేర్చడం ద్వారా రక్తహీనత లాంటి జబ్బులను తరిమికొట్టొచ్చు.
రక్తహీనత ఉన్నవారిలో సరైన మొత్తంలో ఐరన్ ఉన్నప్పటికీ.. వారి రక్తంలో ఇనుము తక్కువగా ఉంటుంది. రక్తహీనత లేని వ్యక్తులు కూడా ఆరోగ్యంగా ఉండటానికి పండ్లను తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన శరీరంలోని రక్తం తక్కువగా ఉంటే లేదా హిమోగ్లోబిన్ తక్కువగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్తంలో ఎర్ర రక్తకణాలు అవసరమైన దానికంటే తక్కువగా ఉన్నప్పుడు శరీరంలోని రక్తంలో లోపం ఏర్పడుతుంది. అలాంటి సమయంలో బలహీనతగా అనిపిస్తుంది. దీనినే రక్తహీనత అంటారు. రక్తహీనత ఉన్నవారు త్వరగా అలసిపోతారు.
రక్తహీనత ఉన్నవారిలో సరైన మోతాదులో ఐరన్ ఉన్నప్పటికీ.. వారి రక్తంలో ఇనుము తక్కువగా ఉంటుంది. శరీరంలో రక్తహీనతను నయం చేసే మూడు పండ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ మూడు పండ్లను తింటే రక్తహీనతను సులువుగా జయించొచ్చు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు బీట్‌రూట్, అంజీర్, దానిమ్మ ఫ్రూట్స్‌ను తినడాన్ని అలవాటు చేసుకోవాలి.
బీట్‌రూట్ బహు బాగు
బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని రక్తహీనత నయమవుతుంది. అంతేకాకుండా శనగపిండిలో బెల్లం కలిపి తింటే శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. కుదిరితే ప్రతిరోజూ ఉదయం పాలు, టీకి బదులుగా బీట్‌రూట్ రసాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. బీట్‌రూట్‌తోపాటు బెల్లం, వేరుశెనగలు కూడా మన బాడీలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి. వీలైతే, వీటినీ తింటూ ఉండాలి.
ఆరోగ్యాన్నిచ్చే అంజీర్
అంజీర్ శారీరక రుగ్మతలను నయం చేస్తుంది. మన దేహంలోని రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. అంజీర్ పండ్లను నానబెట్టి తినడం మంచిది. రాత్రిపూట నానబెట్టి, ఉదయం నిద్రలేచిన తర్వాత వీటిని తింటే రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది.
Blood Levels: డిప్రెషన్, తలనొప్పినీ తగ్గించే.. దానిమ్మ
దానిమ్మ శీతలీకరణ గుణాలను కలిగి ఉంటుంది. ఈ పండును రోజూ తింటే శరీరంలో రక్తంతోపాటు హిమోగ్లోబిన్ స్థాయి కూడా బాగా పెరుగుతుంది. దానిమ్మలో విటమిన్ ఏ, సీ, ఈ ఉంటాయి. దానిమ్మ గింజలను రోజూ తింటే తలనొప్పి, డిప్రెషన్, సోమరితనం లాంటివి దూరమై హెల్తీగా ఉంటారు. మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే బీట్‌రూట్, అంజీర్, దానిమ్మ లాంటి పండ్లను తినడాన్ని అలవాటు చేసుకుంటే రక్తహీనతతోపాటు శరీరం నొప్పులు, బలహీనతను కూడా అధిగమించొచ్చు.