BJP : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. నందమూరి కుటుంబసభ్యులు కూడా దీనిపై స్పందించారు. ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించాడు. ట్విట్టర్ లో ఎన్టీఆర్ స్పందిస్తూ ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ ప్రజాదరణ కలిగిన నేతలేనని వ్యాఖ్యానించారు. కానీ పేరు మార్పును మాత్రం ఎన్టీఆర్ సరిగ్గా ఖండించలేదు. పాము చావొద్దు.. కట్టె విరగొద్దు అనే రీతిలో ఎన్టీఆర్ స్పందించారు.
కానీ ఎన్టీఆర్ సరిగ్గా స్పందించకపోవడంపై టీడీపీ వర్గాలు భగ్గుముంటున్నాయి. ఎన్టీఆర్ పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు. జగన్ నిర్ణయాన్ని ఖండించాల్సిది పోయి వైఎస్సార్ ను పొగుడుతాడా అంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో భారీగా నెగిటివ్ ట్రోలింగ్ వస్తుంది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మద్దతు తెలిపారు. ఎన్టీఆర్ పై నెగిటివ్ ట్రోలింగ్ చేయడం కరెకట్ కాదని వ్యాఖ్యానించారు.
ఇది రాజకీయ వికృతానికి, దగా రాజకీయాలకు పరాకాష్ట అంటూ జీవీఎల్ మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ను అవమానించడం, కార్యకర్తలను ఉసిగొల్పడం దగా రాజకీయాలకు పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేవారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి టీడీపీని దక్కించుకునేందుకు ఒక పోటు పోడిచిన వారు ఈ రోజు ఆయనపై అతి ప్రేమను ఒలకబోస్తున్నారనని జీవీఎల్ ఆరోపించారు. ఎన్టీఆర్ పేరును వైసీపీ ప్రభుత్వం తొలగించడం మమ్మాటికి దుర్మా్ర్గమేనని వ్యాఖ్యానించారు.
BJP :
ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే పేరు మార్చారని జీవీఎల్ ఆరోపించారు. ఎన్టీఆర్ మనసును మీ వికృత రాజకీయాల కోసం క్షోభ పెట్టవద్దని సీఎం జగన్ కు జీవీఎల్ సూచించారు. భయవంతుడి ప్రతిరూపంగా ప్రజల మనసులో నిలిచిపోయిన ఎన్టీఆర్ ను వైసీపీ వివాదంలోకి లాగడంస రికాదని జీవీఎల్ సూచించారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.