BJP :ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఒక్కో నేత ఒక్కో రకంగా తమ పాపులారిటీని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీలైనన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తే జనంలో పేరు పెరుగుతుందని తెగ ప్రయత్నాలు చేసేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు రైతన్నలతో ముచ్చట పెడుతూ పొలం పనులు చేస్తుంటే మరి కొంతమంది సౌచాలయాలను శుభ్రం చేస్తూ సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్రాక్టర్ నడిపి అందరి దృష్టిని ఆకర్షించారు. పాదయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాలోని యూసఫ్ నగర్ శివారులో ఆయన పర్యటించారు. ప్రస్తుతం రబి సీజన్ కావడంతో పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఎంపీ బండి సంజయ్ దగ్గరికి వచ్చి తమ పొలాన్ని దున్నాలని కోరారు. రైతుల కోరిక మేరకు పాదయాత్రనికి పక్కన పెట్టి రైతు అవతార మెత్తి ట్రాక్టర్ నడిపారు బండి సంజయ్. పొలాన్ని దుక్కి దున్ని బిజెపి శ్రేణులను ఉత్సాహపరిచారు. బండి సంజయ్ ట్రాక్టర్ నడిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇదిలా ఉండగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన శ్రేణులను ఉత్సాహపరిచేందుకు ఏకంగా సౌచాలయాన్ని శుభ్రం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో హాయ్ ప్రెషర్ టాయిలెట్ క్లీనింగ్ యంత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల అంతా కూడా పరిశీలించిన కిషన్ రెడ్డి, ఈ కొత్త పరికరాల పరిధిలో తెలుసుకునేందుకు ఏకంగా టాయిలెట్స్ శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలను ఉద్దేశించి కిషన్ రెడ్డి కొన్ని కీలక సూచనలు చేశారు . గవర్నమెంట్ పాఠశాలల్లో ప్రభుత్వాలు మరుగుదొడ్ల శుభ్రతకు చేపట్టాల్సిన చర్యలు అనేకం ఉన్నాయని వాటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.