Bittiri satti : బిత్తిరి సత్తి… ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో న్యూస్ యాంకర్ గా తనదైన యాసలో వార్తలు చెబుతూ కెరియర్ ప్రారంభించి… ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలను ఇంటర్వ్యూలు చేసుకుంటూ పోతున్నాడు. సత్తితో చేసిన ఇంటర్వ్యూలు కూడా బాగా సక్సెస్ అవుతున్నాయి. అయితే ఈ ఇంటర్వ్యూలకు బిత్తిరి భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా దసరా సందర్భంగా రేంజ్ రోవర్ కారు కొన్నాడు. అంతేకాదు దానికి ఆయుధ పూజా కూడా నిర్వహించాడు.
దాని విలువ సుమారు 2
కోట్లు ఉంటుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ట్విట్టర్ లో ఓ నెటిజెన్ కారుకు సంబంధించిన
ఫోటో ను షేర్ చేస్తూ “రాగి ముద్ద నుండి రేంజ్ రోవర్ కి.కష్టపడితే ముందో వెనకో.. గమ్యాన్ని చేరతారు అనడానికి మన సత్తన్న బెస్ట్ ఎగ్జాంపుల్”, అంటూ రాసుకొచ్చాడు.
Bittiri satti : ఏదేమైనా ఇంత ఖరీదైన కారుని కొనుగోలు చేయడం విశేషమనే చెప్పాలి.
బిత్తిరి సత్తి అనగానే అందరికీ కూడా తీన్మార్ వార్తలు గుర్తొస్తూ ఉంటాయి. అప్పట్లో కేవలం బిత్తిరి సత్తి కోసమే ఆ వార్తలు ఎక్కువగా చూసేవారు. అతను తన బాడీ లాంగ్వేజ్ తో
సరదా యాసతో అన్ని వర్గాల వారికి దగ్గరయ్యాడు. ముఖ్యంగా గ్రామాల్లో కూడా అతనికి మంచి క్రేజ్ దక్కింది. దీంతో అతి తక్కువ కాలంలోనే భారీ స్థాయిలో ఆదాయాన్ని కూడా సొంతం చేసుకున్నాడు.