Bitter Ground Benefits: అసలు చిన్న పిల్లలు కాకరకాయ అంటేనే ఆమడ దూరం పరుగెడుతున్నారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో మాత్రం కాకరకాయ వండడం కూడా చాలా అరుదుగా కనిపిస్తోంది. ఇక పెద్దలే అలా ఉంటే పిల్లలు దాన్ని ఎలా ఇష్టపడతారు చెప్పండి. కానీ వారానికి ఒక సారైనా కాకరకాయను ఆహారంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా కాకరకాయని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా రక్తంలో యూరిక్ ఆసిడ్ ఉంటుంది. ఆహార పదార్థంలో ప్యూరిన్ అనే రసాయనం విడిపోయినపుడు ఈ యూరిక్ ఆసిడ్ తయారవుతుంది. ఈ ప్రక్రియ సక్రమంగా జరిగితే కిడ్నీలు సమర్దవంతంగా పని చేస్తాయి. ఇలా యూరిక్ ఆసిడ్ ని మూత్రం ద్వారా బయటికి పంపడం ద్వారా శరీరంలోని చెడు పదార్థాలను బయటికి పంపిస్తుంది.
ఒక వేళ యూరిక్ ఆసిడ్ శరీరంలో ఉండిపోతే అనేక దుష్పరిణామాలకు దారి తీస్తుంది. డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కీళ్ళ నొప్పిని దూరం చేస్తుంది. పురుషులలో ౩.4 నుండి 7.0 mg వరకు మరియు స్త్రీలలో 2.4 నుండి 6.0 వరకు యూరిక్ఆసిడ్ ఉండాలి. అంత కంటే ఎక్కువగా ఉంటె ప్రమాదం తప్పదు.
Bitter Ground Benefits:
ఇలా జరగకుండా ఉండాలంటే ప్యురిన్ ఎక్కువగా ఉండే క్యాబేజ్, వంకాయ, బీన్స్ వంటి ఆహారాలను దూరంపెట్టి కాకరకాయను ఆహారంలో తీసుకోవాలి. ఇది శరీరంలో యూరిక్ ఆసిడ్స్ ని తగ్గించడానికి దోహాదపడుతుంది. అయితే చేదుగా ఉంటుంది కాబట్టి కాకరకాయ ని తీసుకుంటే చక్కర వ్యాధిని కూడా నియంత్రిస్తుంది. అంటే అతిగా తింటే ఏదైనా ప్రమాదమే కాబట్టి కాకరకాయని కూడా కొంచం తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. అసలే తీసుకోకుండా ఉండడం కంటే చేదుగా ఉందని వదిలి పెట్టడం కంటే వారంలో ఒక రోజు లేదా ఒక పూట తప్పని సరిగా తీసుకోండి.