Bindu Madhavi: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్, బిగ్ బాస్ బ్యూటీ విన్నర్ బిందు మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిందు మాధవి బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వకముందే హీరోయిన్ గా అందరికీ సుపరిచితమే. కాగా మొదట హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయిన బిందు మాధవి కొన్ని సినిమాలలో నటించి ఆ తర్వాత ఇండస్ట్రీకీ దూరం అయ్యింది.
చాలా కాలం తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మళ్లీ ప్రేక్షకులను పలకరించింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్‌గా నిలిచి,బిగ్ బాస్ చరిత్రలోనే మొదటి లేడి విన్నర్ గా నిలిచింది బిందు మాధవి. ఇకపోతే బిందు మొదట కమల్ కామరాజు హీరోగా నటించిన అవకాయ్ బిర్యానీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.
తెలుగులో బంపర్ ఆఫర్, ఓం శాంతి,రామ రామ కృష్ణ కృష్ణ,ప్రతి రోజు,పిల్ల జమిందార్ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా ఆమెకు సరైన సక్సెస్ ని తెచ్చిపెట్టలేకపోయాయి. దాంతో బిందు మాధవి నెమ్మదిగా సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యింది.
తెలుగు సినిమాలలో నటించకపోయినప్పటికీ తమిళ సినిమాలో నటిస్తూ దూసుకుపోతోంది. తెలుగు బిగ్ బాస్ లో మాత్రమే కాకుండా 2017లో ప్రసారమైన బిగ్ బాస్ తమిళ మొదటి సీజన్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి టాప్ ఫైవ్ లో నిలిచింది. కానీ తెలుగులో మాత్రం విన్నర్ గారు నిలిచి తన అతను చాటుకుంది.
అయితే బిగ్ బాస్ విన్నర్ గా గెలిచిన తర్వాత బిందు మాధవి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అందంతో యువతని కట్టిపడేస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా బిందు మాధవి డాన్స్ పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అవుతున్నాయి. ఆ ఫోటోలలో బిందు మాధవి తన ఎద అందాలు కనిపించే విధంగా డ్రస్సును ధరించి డాన్స్ ను అదరగొడుతుంది.