Biggboss 6 : రెండోవారం కెప్టెన్సీ ఎంపిక చాలా ఆసక్తికరంగా సాగింది. నిన్నటితో కెప్టెన్ ఎవరనే దానికి తెరపడింది. సుదీప-కీర్తిలు ఏకాభిప్రాయంతో కెప్టెన్‌గా రాజ్‌కి జై కొట్టారు. రాజ్ కెప్టెన్‌గా ఉంటే అతని మాట ఎవరూ వినరని.. అందుకే తాను ఇనయనకి సపోర్ట్ చేస్తానని చెప్పింది సుదీప. అయితే కీర్తి ఆమెను ప్రభావితం చేసి.. రాజ్‌కి సపోర్ట్ చేసేట్టు చేసింది. మొత్తానికి స్ట్రార్టింగ్ నుంచి రాజ్ హవా సాగింది. కనీసం ఎవరూ కూడా ఇనయకు సపోర్ట్‌గా నిలవలేదు. బిగ్‌బాస్ సీజన్ 6 రెండవ కెప్టెన్‌గా రాజ్ ఎన్నికయ్యాడు. ఈసారి లైవ్ ప్రసారాల తంతు నడుస్తుండటంతో సస్పెన్స్ లేకుండా ఎవరు కెప్టెన్ అవుతారు.. ఎవరు టాస్క్‌లలో గెలుస్తున్నారన్నది ముందే లీక్ అవుతోంది.
ఇక నిన్న (సెప్టెంబర్ 16) రాత్రి ఎపిసోడ్ 13 అప్డేట్స్ విషయానికి వస్తే.. కెప్టెన్‌గా రాజ్‌కి సపోర్ట్ ఉంటుంది కానీ.. ఇలా ఉంటే కుదరదని ఆర్జే సూర్య అంటాడు. ఇక ఇనయన.. హౌస్‌లో ఉన్న వాళ్లు తనకి సపోర్ట్ చేయకపోవడంతో ఇనయ చాలా ఫీల్ అయ్యింది. తాను ఎంత కష్టపడి ఆడానో.. జనం చూస్తున్నారని మాట్లాడింది. శ్రీ సత్య వచ్చి.. ఓదార్పు యాత్ర చేపట్టింది. ఇనయను కూల్ చేసేందుకు యత్నించింది. నువ్ కెప్టెన్ అయినా.. అవ్వకపోయినా.. జనానికి నచ్చితే చివరి వరకూ ఉంటావ్ అని ఇనయకు హిత బోధ చేసింది. ఈమె మాత్రం ఇప్పటి వరకూ ఆట మొదలు పెట్టింది లేదు. కనీసం ఒక్కటంటే ఒక్క టాస్క్ కూడా సీరియస్‌గా తీసుకుని ఆడింది లేదు. పొట్టి పొట్టి బట్టలేసుకుని స్కిన్ షో చేయడానికి తప్పితే.. ఆడటానికి వచ్చినట్టు కనిపించడం లేదు. ఉచిత సలహాలు మాత్రం మామూలుగా లేవు. కనిపించిన వారికల్లా హితబోధ చేస్తూ వెళుతోంది.
Biggboss 6 : కెప్టెన్ అయితే 20 మందిని ఆడుకుంటా..
ఆ తరువాత మార్నింగ్ సాంగ్‌కి స్టెప్పులు వేసి హౌస్‌లో రచ్చ చేశారు కంటెస్టెంట్స్. ఆ తరువాత రాజ్-ఇనయనలు కెప్టెన్సీ కోసం మాట్లాడుకున్నారు. నేను కెప్టెన్ అయితే 20 మందిని ఆడుకుంటా అని ఇనయ చెప్పింది. శ్రీహాన్.. సింగర్ రేవంత్ దగ్గర కూర్చుని తాను ఏ పనీ చేయడం లేదని అనుకుంటున్నారని ఫీల్ అయ్యాడు. పని విషయంలో కెప్టెన్ బాలాదిత్య సమన్యాయం చేయలేకపోతున్నాడని అన్నాడు రేవంత్. ఫైమా అయితే జోక్‌లు వేసుకుంటూనే నడిపించేస్తుందని.. పని మాత్రం చేయడం లేదని అన్నాడు రేవంత్. మొత్తానికి ఒకరి మీద ఒకరు బాగానే దుమ్మెత్తి పోసుకుంటున్నారు.