Bigg boss Sri Sathya:బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో శ్రీ సత్య ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఆరో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీసత్య.. పూర్తి పేరు మంగళంపల్లి శ్రీ సత్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరానికి చెందిన శ్రీ సత్య 2015వ సంవత్సరంలో మిస్ విజయవాడగా టైటిల్ గెలవడం జరిగింది. ముద్దమందారం ,త్రినయని, నిన్నే పెళ్ళాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెల్లు వంటి సీరియల్స్‌తో ఎంతో పాపులారిటీ సంపాదించిన శ్రీ సత్య.. ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన “నేను శైలజా” సినిమాలో హీరో గర్ల్ ఫ్రెండ్ గా నటించడం జరిగింది. అయితే హౌస్ లోకి వెళ్లక ముందు తనని సపోర్ట్ చేయాలని శ్రీ సత్య.. ఓ వీడియో చేసింది. దానిపై ట్రోలింగ్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది.
శ్రీ సత్య మాట్లాడిన విధానం చాలా పొగరుగా ఉన్నట్లు నెటిజెన్లు అభివర్ణిస్తూ హౌస్ లో… ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్లు ఎక్కువగా ఉండరు త్వరగా బయటికి వచ్చేస్తావులే.. అంటూ సదరు వీడియోకి కామెంట్ పెడుతూ ఉన్నారు. ఆ వీడియోలో శ్రీ సత్య మాట్లాడిన విధానం…”అందరికీ నా నమస్కారం. నేను మీ సత్య.. అందరూ ఎలా ఉన్నారు..? అందరూ బాగుండాలని నేను అనుకుంటున్నాను. ఇక విషయానికొస్తే నన్ను సీరియల్స్ ఇంకా వెబ్ సిరీస్ లలో చూశారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో చూడబోతున్నారు. నేను సీజన్ సిక్స్ లో ఆడుతున్నాను నేను చేసే ఈ వీడియో బయటకు వచ్చేసరికి నేను హౌస్ లో ఉంటాను. మొట్టమొదటిగా అందరికీ నా కృతజ్ఞతలు.
Bigg boss Sri Sathya:
నా కెరియర్ ప్రారంభించిన నాటినుండి నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను.. నన్ను సపోర్ట్ చేస్తారు కదా..? ప్రతి ఓటు విలువైనదే. నా గేమ్ నచ్చితే… నాకు ఓటు వేయండి. బయటకు వచ్చాక మళ్ళీ కలుస్తాను అంటూ శ్రీ సత్య వీడియో రూపంలో తనకు మద్దతు తెలపాలని కోరడం జరిగింది. దేనికి నటిజన్స్ కాస్త పొగరుగా ఉంది అంటూ త్వరగా నే ఈ అమ్మాయి బయటకు వచ్చేయడం గ్యారెంటీ అని కామెంట్లతో కౌంటర్లు ఇస్తున్నారు.