Bigg Boss Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో హోటల్ వర్సెస్ హోటల్ అనే కెప్టెన్సీ కంటెస్టెంట్స్ పోటీదారుల టాస్క్ కొనసాగింపులో భాగంగా రాత్రి భోజనాలతో మంగళవారం ముగిసిన ఎపిసోడ్ బుధవారం మొదలైంది. డబ్బులు సంపాదించడం కోసం చేసుకున్న డీల్స్ గురించి హౌస్ సభ్యుల మధ్య డిష్కషన్స్ జరిగింది. ఇక మరోవైపు ఇనయ, సూర్య మధ్య కాసేపు డ్రామాతో కూడిన ప్రేమాయణం కొనసాగింది. కాసేపు గెస్టులతో జరిగిన డీల్ గురించి ఫైమా, సుదీప మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత ఆరోజుకి టాస్క్ సమయం ఇంతడితో ముగిసిందని మరలా రేపు బిగ్ బాస్ ఆదేశంతో టాస్క్ తిరిగి ప్రారంభం అవుతుందని బిగ్ బాస్ చెబుతాడు.
టాస్క్ సమయం ముగిసినప్పటికీ బాత్ రూమ్స్ వాడుకుంటే డబ్బులు పే చేయాలని సుదీప అనౌన్స్ చేస్తుంది. ఈ టాస్క్ లో డబ్బుల కోసం రేవంత్ ఏకంగా ఇనయ కాళ్లు నొక్కడం గమనార్హం. హౌస్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ ఏ హోటల్ పరిధిలోకి వస్తుందనే విషయంపై గెస్టులు, హోటల్స్ సభ్యుల మధ్య చర్చ సాగుతుంది. అలా ఆ రోజు రాత్రి గడుస్తుంది. నాదీ నక్కిలీసు గొలుసు సాంగ్ తో డ్యాన్స్ తో మరుసటిరోజు స్టార్ట్ చేస్తారు బిగ్ బాస్ కంటెంస్టెంట్స్. లేవగానే ఆదిరెడ్డి టాస్క్ లో భాగంగా బిబి హోటల్ ఫుడ్ గురించి పూర్తి నెగిటీవ్ రివ్యూని ఇస్తాడు.

ఇక సూర్య గజని గెటప్ తో ఎంట్రీ ఇస్తాడు. తనదైన శైలిలో ప్రదర్శనతో అదరగొడతాడు. ఎవరు ఎంత డబ్బులు సంపాదించారో బిగ్ బాస్ తెలుసుకోవాలని అనుకుంటాడు. బిబి హోటల్ స్టాఫ్ దగ్గర రూ.4,300 అని చెప్తుంది. గ్లామ్ హోటల్ తరపున రూ. 5,400 ఉన్నాయని ఫైమా చెప్తుంది. ఎక్కువ అతిధుల్ని ఆకర్షించి హోటల్ గ్లామ్ ప్యారడైజ్ ఎక్కువ డబ్బులు సంపాదించారు. దీంతో గ్లామ్ ప్యారడైజ్ హోటల్ కి పోటీగా ఉన్న బిగ్ బాస్ హోటల్ ని కూడా వారి ఆదిపత్యంలోకి తీసుకునే అవకాశం ఇస్తాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా బిబి హోటల్ సభ్యుల్లో నుంచి గ్లామ్ ప్యారడైజ్ హోటల్ సభ్యులు ముగ్గురు స్టాఫ్ ను తీసుకునే అవకాశం ఇస్తాడు. మిగతా స్టాఫ్ ని ఉద్యోగం నుండి తీసేసి కెప్టెన్సీ పోటీదారుల నుండి తొలగించే అవకాశాన్ని గ్లామ్ ప్యారడైజ్ సభ్యులకు ఇస్తాడు. ఈ టాస్క్ లో ఇచ్చిన టాస్క్ లో చంటి పూర్తిగా విఫలమవడంతో కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగిస్తాడు బిగ్ బాస్.
బిబి హోటల్ లో పోటీ నుండి తప్పుకోవడానికి ఆదిత్య, రేవంత్ ని అనౌన్స్ చేస్తారు. ఇక టాస్క్ రెండవ లెవల్ స్టార్ట్ అవుతుంది. ఇందులో భాగంగా ఫైమాతో పాటు అందరూ ఎలా టాస్క్ ఆడాలి అనేది డిస్కస్ చేస్తారు. ఇందులో శ్రీసత్యను పిలవకపోవడంతో తాను వ్యక్తిగతంగా ఆడతానని అనౌన్స్ చేస్తుంది. పోల్ డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది. డ్యాన్స్ చేసిన వారిలో శ్రీసత్య, వాసంతికి గెస్ట్ రోల్ చేస్తున్న అర్జున్ టిప్ ఇస్తాడు. ఇలా ఎవరికి వారు డబ్బులు టిప్స్ కింద పంచుకుంటారు. తన దగ్గర డబ్బులు తక్కువగా ఉందనే కారణంతో సుదీప ఏడిస్తే రేవంత్, శ్రీసత్య డబ్బులు ఇస్తారు. ఇంతటితో టాస్క్ ముగుస్తుంది. డబ్బులు ఎవరిదగ్గర ఎంత ఉన్నాయో చెప్పాలని బిగ్ బాస్ అడుగుతాడు. ఎంత ఉంది అనే విషయాన్ని బిగ్ బాస్ కి చెప్తారు. తర్వాత కెప్టెన్సీ పోటీదారులకు సంబంధించిన వివరాలను సమయం వచ్చినప్పుడు చెబుతానని బిగ్ బాస్ అనౌన్స్ చేయడంతో బుధవారం ఎపిసోడ్ ముగుస్తుంది.