Bigg Boss Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో నాలుగో వారం స్టార్ట్ అయింది. మంగళవారం ఎపిసోడ్ లో ముందుగా రాత్రి వరకు నామినేషన్స్ గురించి సభ్యుల మధ్య జరిగిన చర్చను చూపిస్తారు. పైసా వసూల్ సాంగ్ తో మరుసటి రోజు కంటెస్టెంట్స్ నిద్రలేచారు. ముందుగా సూర్య, ఆరోహి మధ్య రిలేషన్ షిప్ గురించి వారిద్దరే మాట్లాడుతున్న సీన్స్ చూపిస్తారు. తర్వాత డే టైంలో నిద్రపోతున్న చంటిని బిగ్ బాస్ నిద్రలేపి సీక్రెట్ రూంలోకి పిలుస్తాడు. చంటికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇస్తాడు. అనంతరం చంటి బయటకి వచ్చి ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ గురించి చదివి వినిపిస్తాడు. హోటల్ వర్సెస్ హోటల్ అనే టాస్క్ ని బిగ్ బాస్ ఈ వారం కంటెస్టెంట్స్ కి ఇచ్చిన టాస్క్ పేరు. ఈ టాస్క్ నియమ, నిబంధనల ప్రకారం ఎవరి క్యారెక్టర్ లోకి వారు వెళ్లిపోతారు. టాస్క్ లో భాగంగా అందరూ టాస్క్ ని ఎలా ఆడి గెలవాలి అనే దానిపై డిస్కషన్స్ జరుపుతారు. టాస్క్ లో భాగంగా శ్రీసత్య తనదైన శైలిలో శ్రీహాన్ ని తన హోటల్ కి రప్పించుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తుంది. అందుకు శ్రీహాన్ ఓకే అని చెప్తాడు. తర్వాత టాస్క్ స్టార్ట్ చేయడం కోసం బజర్ మోగుతుంది.

దీంతో టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఎవరికి వారు ప్రదర్శన ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. బిబి హోటల్ సభ్యులు ఓవైపు, గ్లామ్ ప్యారడైజ్ హోటల్ సభ్యులు మరోవైపు గెస్టులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ఇందులో హీరో క్యారెక్టర్ గా వ్యవహరిస్తున్న శ్రీహాన్ బిబి హోటల్ లో రేవంత్ సర్వీసుకు డబ్బులు ఇస్తాడు. మధ్య మధ్యలో మతిమరుపు క్యారెక్టర్ లో ఉన్న సూర్య తనదైన శైలిలో ప్రదర్శన చూపిస్తారు. ఛాన్స్ దొరికిందని గెస్ట్ రోల్ లో ఉన్న అర్జున్ ను శ్రీసత్య ఓ రేంజ్ లో కాకా పట్టి బుట్టలో వేసుకుంటుంది. అమ్మాయి డ్రస్ వేసుకుని తేడా క్యారెక్టర్ తో సూర్య అదరగొట్టేశాడు. హోటల్ గ్లామ్ ప్యారడైజ్ హోటల్ పరిధిలో పోల్ డ్యాన్స్ కూడా వేస్తాడు. ఇది ఈరోజు ఎపిసోడ్ లో హైలెట్ గా నిలిచింది. సూర్యతో పాటు అందరూ దాదాపు సగం కంటెస్టెంట్స్ డ్యాన్సులు వేస్తారు.
ధనవంతురాలైన ఇనయ పోల్ డ్యాన్స్ వేయాలని కోరడంతో ఫైమా డ్యాన్స్ వేసి ఎంటర్ టైన్ చేస్తుంది. ఇలా గ్లామ్ ప్యారడైజ్ హోటల్ సభ్యులైన అమ్మాయిలు గెస్ట్ ల దగ్గర డబ్బుల సంపాదిస్తూ ఉంటారు. రాత్రి ఫుడ్ కోసం ఎవరికి వారు డీల్స్ చేసుకుని డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తారు. రాత్రి అందరూ ఫుడ్ తినేటప్పుడు టాస్క్ లో భాగంగా గ్లామ్ ప్యారడైజ్ హోటల్ లో అందమైన అమ్మాయిగా వ్యవహరిస్తున్న శ్రీసత్య డీల్ ప్రకారం అర్జున్ కు స్వయంగా తన చేతులతో తినిపిస్తూ ఉంటుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా ఫన్నీగా సాగింది.