Bigg Boss Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో నామినేషన్ల్ పర్వం కొనసాగుతోంది. రెండవ వారంలో నామినేషన్స్ లో ఉన్నటువంటి షానీ, అభినయ హౌస్ లో నుండి బయటకు వచ్చేశారు. ఇక మూడో వారంలో నామినేషన్స్ ప్రక్రియ సాదాసీదాగా జరగలేదు. ఓ రేంజ్ లో సాగింది. వాదోప వాదనల మధ్య హాట్ హాట్ గా సాగిన ఈ నామినేషన్స్ బరిలో చంటి, నేహ, ఆరోహి, రేవంత్, గీతూ, ఇనయ, వాసంతి, బాలాదిత్య, శ్రీహాన్ ఉన్నారు. ఆదివారం ఎప్పటిలాగే నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.
ముందుగా ఎవరి క్యారెక్టర్ ఏంటి అనే దానిపై సుత్తితో దెబ్బ అనే ఆటతో నాగార్జున షో స్టార్ట్ చేస్తారు. ముందుగా నోటి దూల ఎవరికి ఉంది అని ఆదిరెడ్డిని నాగార్జున అడుగుతాడు. ఇందుకు అక్కడ గేమ్ లో భాగంగా నోటి దూల గీతూకి ఉంది అని ఆదిరెడ్డి సుత్తిని గీతూ నెత్తి మీద కొట్టి చెబుతాడు. ఇలా గేమ్ సాగుతూ ఉంటుంది. మధ్యలో నామినేషన్స్ పర్వం కొనసాగుతుంది.

ఇందులో భాగంగా నిమినేషన్స్ లో ఉన్న వారందరినీ లైన్ లో ఉంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు నాగార్జున. మొదటి రౌండ్ నామినేషన్స్ లో ఉన్న గీతూ శ్రీహాన్ ముందుగా సేఫ్ అవుతారు. మిగిలిన ఏడుగురిలో రెండో రౌండ్ లో ఇనయ, రేవంత్ సేఫ్ అవుతారు. మూడో రౌండ్ లో బాలాదిత్య ఆరోహి సేఫ్ అవుతారు. మరో రౌండ్ లో చంటి సేఫ్ అవుతాడు. ఇక చివరగా వాసంతి, నేహా నామెనేషన్స్ లో ఫైనల్ చేరుతారు.
దీంతో వీరిద్దరి ఎలిమినేషన్స్ కి సంబంధించి తులాభారం అనే రౌండ్ ని పెడతాడు నాగార్జున. ఈ తులాభారం రౌండ్ లో వాసంతి సేఫ్ అవుతుంది. నేహా ఎలిమినేట్ అవుతుంది. ఈ సారి నామినేషన్స్ అంత ఆసక్తికరంగా లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే నేహా ఎలిమినేషన్ అవుతుందని ఒకరోజు ముందుగానే లీక్ అయింది. అనుకున్నట్లుగానే నేహా ఎలిమినేట్ అవడంతో ఆసక్తి తగ్గింది. నేహా కూడా ఎలిమినేట్ అయినందుకు పెద్దగా ఫీల్ అవ్వదు. క్యాజువల్ గానే బిగ్ బాస్ హౌస్ లో నుండి నేహా బయటకి రావడం.. ఎప్పటిలాగే హౌస్ లో ఉన్న వారి గురించి అభిప్రాయం చెప్పడంతో ఆదివారం ఎపిసోడ్ ముగుస్తుంది.