Bigg Boss Review: అందమైన భామలు సాంగ్ పాడుతూ తెలుగు టాప్ సింగర్ దేవి శ్రీ ప్రసాద్ తో ఈ ఆదివారం ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఈ సాంగ్ మధ్యలో అమ్మాయిల మధ్య నాగార్జున ఎంట్రీ ఇస్తాడు. కాసేపు నాగార్జున కోసం మంచి ఊపున్న సాంగ్స్ పాడతాడు దేవి శ్రీ ప్రసాద్. ఓపిల్లా అనే ఆల్బమ్ సాంగ్ రిలీజ్ చేస్తారు. మన టీవి ద్వారా బిగ్ బాస్ సభ్యులతో వీరిద్దరూ కనెక్ట్ అవుతారు. ఈ వారం బిగ్ బాస్ కానుక ఎవరికి ఇవ్వాలో దేవి డిసైడ్ చేస్తాడు. రెండు టీంలుగా విభజిస్తారు. పిక్సనరి అనే గేమ్ ఆడిస్తారు.
కాసేపు గేమ్ సరదా సరదాగా సాగుతుంది. కెవ్వు కేక సాంగ్ తో ఈ గేమ్ ముగుస్తుంది. ఇంతటితో దేవి శ్రీ ప్రసాద్ వెళ్లిపోతాడు. తర్వాత నామినేషన్స్ లో ఉన్న వారు నిలబడతారు. ఈ రౌండ్ లో వసంతి సేఫ్ అవుతుంది. తర్వాత సామెతలకు ఎవరికి వర్తిస్తాయో వారికి అంకితం చేసి ఎందుకు చేశారు అనేది వివరించాలి. ఇలా అందరూ సామెతలు సెలక్ట్ చేసుకుని తోటి కంటెస్టెంట్స్ కి ఎందుకు వర్తించిందో వివరిస్తారు.

తర్వాత మరలా నామినేషన్స్ లో ఉన్న వాళ్లు లేచి నిల్చుంటారు. ఈ రౌండ్ లో మెరీన సేఫ్ అవుతుంది. తర్వాత రౌండ్ లో అర్జున్ సేఫ్ అవుతారు. చివరగా ఇనయ, చంటి మిగులుతారు. దీంతో ఇనయ వెళ్తుందేమో అని సూర్య వెక్కివెక్కి ఏడుస్తాడు. మరోవైపు చంటి వెళ్తాడేమో అని ఫైమా, రాజ్, రేవంత్ ఏడుస్తారు. తర్వాత మరలా నామినేషన్స్ లో ఉన్న ఇనయ, చంటి నిల్చుంటారు. ఈ ఫైనల్ రౌండ్ లో ఇనయ సేఫ్ అవుతంది. ఊహించనట్లుగానే చంటి ఎలిమినేట్ అవుతాడు..!
హౌస్ లో నుండి స్టేజ్ మీదకు వచ్చేస్తాడు చంటి..! ఎప్పటిలాగే బిగ్ బాస్ హౌస్ లో చంటి జర్నీ చూపిస్తారు. తర్వాత మన టీవి ద్వారా కనెక్ట్ అవుతారు. బిగ్ బాస్ రిపోర్ట్ కార్డు మీద 100 కు ఎన్ని మార్కులు వేస్తారు అని చంటికి టాస్క్ ఇస్తాడు. ఎవరికి ఎన్ని మార్కులో ఇవ్వాలో ఇచ్చేసి ఎందుకు ఇచ్చాడో చెప్తాడు. చివరగా గీతూ, కీర్తి, రేవంత్ వీరు ముగ్గురికి ప్రత్యేకంగా సలహాలు ఇచ్చి షో లో నుండి చంటి వెళ్లిపోతాడు. అంతటితో ఆదివారం ఎపిసోడ్ ముగుస్తుంది.