Bigg Boss Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఇక ఊహించినంత రేంజ్ లో హాట్ హాట్ గా సాగుతోంది. మాంచి సాంగ్ తో సోమవారం ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. వెంటనే నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. అందరూ గార్డెన్ ఏరియాలో నిలబడి ఉంటారు. ఇంటి సభ్యులు వారు నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరు సభ్యుల దిష్టి బొమ్మలపై ఒక్కో కుండను పెట్టి తగిన కారణాలు చెప్పిన తర్వాత ఆ కుండను పగులగొట్టాల్సి ఉంటుంది.
ముందుగా బిగ్ బాస్ గీతూతో నామినేషన్స్ స్టార్ట్ చేయమని చెప్తాడు బిగ్ బాస్. తగిన కారణాలు చెప్పి మెరీనా, రోహిత్ ను నామినేట్ చేస్తుంది గీతూ. ఇక ఇనయ, కీర్తిని రేవంత్ నామినేట్ చేశాడు. ఈ క్రమంలో ఇనయ, రేవంత్ మధ్య వాదనలు జరుగుతాయి. ఆదిరెడ్డి తనదైన శైలిలో కారణాలు చెబుతూ ఇనయ గేమ్ ఆడుతుందని చెబుతూ నామినేట్ చేస్తాడు. విన్నర్ క్వాలిటీస్ ఏమ్ కావాలో అవి వాంటెడ్ గా పెట్టుకుని చేయకూడదు అని ఆదిరెడ్డి అంటారు. నీవే అంటున్నావుగా నీవు విన్నర్ క్వాలిటీ పెట్టుకుని ఆడానని సో నేను బిగ్ బాస్ సీజన్ సిక్స్ విన్నర్ నేనే అని ఇనయ గట్టిగా అంటుంది.

బాగా ఆడుతున్నాడు అంటూనే రేవంత్ ని ఆదిరెడ్డి నామినేట్ చేస్తాడు. నేను నా భర్త కలిసి ఆడుతున్నారే కారణంతో శ్రీసత్యను మెరీనాను నామినేట్ చేస్తుంది. గీతూని తర్వాత నామినేట్ చేస్తుంది మెరీనా. ఇక శ్రీసత్య, ఫైమాను బాలాదిత్య నామినేట్ చేస్తాడు. రేవంత్, గీతూని కీర్తి నామినేట్ చేస్తుంది. ఊహించినట్లుగానే శ్రీతస్య, గీతూని రోహిత్ నామినేట్ చేస్తాడు. గీతూ, రేవంత్ ను వాసంతి నామినేట్ చేస్తుంది.
గీతూ, బాలాదిత్యను రాజ్ నామినేట్ చేస్తాడు. వెటకారం వస్తే ఎడిటింగ్ లో తీసేయండి అంటూ మరోసారి వెటకారం చేస్తూ బాలాదిత్యను ఫైమా నామినేట్ చేస్తుంది. నాకు వెటకారం మోతాదు మించితే మీకు మంచితనం మోతాదు మంచిపోయిందని అని చెప్పి నామినేట్ చేస్తుంది ఫైమా. తర్వాత ఫైమా ఇనయను నామినేట్ చేసిన క్రమంలో వాదోపవాదనలు పెద్దగా జరుగుతాయి. బాలాదిత్య, ఇనయను శ్రీసత్య నామినేట్ చేస్తుంది. గీతూ, ఆదిరెడ్డిని ఇనయ నామినేట్ చేస్తుంది. కీర్తి, ఇనయను నామినేట్ చేస్తాడు శ్రీసత్య. ఈ వారం ఇంటినుండి బయటకి వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు ఇనయ, గీతూ, రేవంత్, ఆదిత్య, శ్రీసత్య, కీర్తి, ఫైమా, రోహిత్, ఆదిరెడ్డి, మెరీనా అని బిగ్ బాస్ ప్రకటించడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.