Bigg Boss Review: లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా హీరోయిన్ తో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. శనివారం నాటి ఎపిసోడ్‌లోనే నాగార్జున సూర్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయినప్పటికీ హౌస్‌మేట్స్‌కు కానీ, ప్రేక్షకులకు కానీ నమ్మకం కలగలేదు. గత సీజన్‌లలో మాదిరిగానే సూర్యను సీక్రెట్ రూమ్‌లో పెడతారని చాలా మంది భావించారు. కానీ, అదేమీ జరగలేదు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో సూర్యను నేరుగా వేదికపైకి పిలిచిన నాగార్జున.. సాధారణంగానే అతడికి తన బిగ్ బాస్ జర్నీ వేసి చూపించారు. ఆ తరవాత మన టీవీ ద్వారా హౌస్‌మేట్స్‌ను పలకరించారు. ముందు సూర్య వెళ్లిపోయాడని చెప్పిన నాగార్జున.. హౌస్‌మేట్స్ అంతా సైలెంట్ అయిపోవడంతో సూర్యను చూపించి బాయ్ చెప్పండని ఝలక్ ఇచ్చారు.
రెగ్యులర్‌గా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌కు ఇచ్చినట్టే సూర్యకు కూడా నాగార్జున ఒక టాస్క్ ఇచ్చారు. హౌస్‌లో ఉన్నవారిలో ఫ్లవర్ ఎవరు, ఫైర్ ఎవరు చెప్పాలని సూర్య ముందు రెండు బోర్డులు ఉంచారు నాగార్జున. మొదట రేవంత్, గీతూ, శ్రీహాన్, బాలాదిత్య ఫైర్ అని వారి ఫొటోలను ఫైర్ బోర్డుపై ఉంచాడు సూర్య. తరవాత ఫైమా ఫొటోను ఫ్లవర్ బోర్డుపై ఉంచాడు. అయితే, ఇక్కడ నాగార్జున ఒక క్లారిటీ ఇచ్చారు. ఫైర్ బోర్డు పాజిటివ్ అని.. ఫ్లవర్ బోర్డు నెగిటివ్ అని చెప్పారు. దీంతో సూర్య తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ముందు ఫైర్ బోర్డుపై పెట్టిన రేవంత్, గీతూ, శ్రీహాన్, బాలాదిత్య ఫొటోలను ఫ్లవర్ బోర్డుపైకి తీసుకొచ్చాడు. ఫైర్ బోర్డుపై ఫైమా, ఇనయ, రాజ్, కీర్తి ఫొటోలు ఉంచాడు. మిగిలిన వాళ్లను సూర్య పరిగణనలోకి తీసుకోలేదు.

అయితే, ఇనయ గురించి సూర్య మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ త్రీ వీక్స్ ఫుల్లుగా కొట్టుకున్నాం. నీకూ నాకూ అస్సలు పడుతుండేదే కాదు. ఊరుకూరికే తిట్టుకునేవాళ్లం, నామినేట్ చేసుకునేవాళ్లం, డిజాస్టర్‌లు వేసుకునేవాళ్లం. ఆపోజిట్ పర్సన్స్ క్లోజ్ అవుతారంటే నేను నమ్మేలేదు. కానీ, బిగ్ బాస్ హౌస్‌లో అది నేను చూశాను. హౌస్‌మేట్‌గా నీ గేమ్ యాక్సెప్టబుల్ ఏమో కానీ.. ఇనయగా అయితే మాత్రం కాదు. ఇంకా ఫైర్ కావాలి. నా గేమ్ కూడా నువ్వు ఆడి ఇంకా ఎక్కువ ఫైర్ తీసుకొచ్చి నువ్వు టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నాను’’ అని అన్నాడు.దీనికి ఇనయ స్పందిస్తూ.. ‘‘ఉంటా సూర్య, నీ గేమ్ కూడా కలిపి ఆడతా. అన్నీ గుర్తున్నాయి. సూర్య.. బాగున్నావు. నీకోసం ఎల్లో మ్యాచింగ్ వేసుకున్నా. నువ్వు ఎల్లో వేసుకుంటావని గెస్ చేశాను’’ అంటూ బాధ చూపిస్తూ, నవ్వుతూ, వయ్యారాలు పోతూ చెప్పింది.
‘‘నేను ఎల్లోలో బాగుంటానని నాకు ఇప్పుడూ తెలిసింది’’ అంటూ సూర్య కూడా స్వరం కలిపాడు. ఆ వెంటనే సూర్య అంటూ ఇనయ తన మైక్ బ్యాగ్‌ను చూపించింది. ఆ బ్యాగ్‌పై ఎల్లో కలర్‌లో సూర్యుడిని ఆకారం ప్రింట్ చేసి ఉంది. అలాగే, ఎడమచేతి ఉంగరం వేలుపై కూడా సూర్యుడి ఆకారం ముద్రించుకుంది. అవి చూసి సూర్య మురిసిపోయాడు. అవన్నీ ఏంటని నాగార్జున ప్రశ్నించడంతో.. ‘‘తన గుర్తుగా సార్’’ అంటూ ఇనయ బదులిచ్చింది. ఉంటా సూర్య అంటూ కుడి చేతి రెండు వేళ్లను స్మైలింగ్ సింబల్‌లో పెట్టి టాటా బైబై చెప్పింది. ఇదంతా చూసిన నాగార్జున.. ‘‘ఏమో, తెలియనివన్నీ కొత్తకొత్తవి కనిపిస్తున్నాయి’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.