Bigg Boss Review; బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్ లో ముందుగా 73వ రోజు మంచి సాంగ్ లో అందరూ డ్యాన్సులు వేస్తూ నిద్ర లేస్తారు. వెంటనే కెప్టెన్సీ పోటీదారుల టీస్క్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారులు అవ్వడానికి ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇస్తున్న కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ బిబి ట్రాన్స్ పోర్ట్ అని ఇనయ బిగ్ బాస్ ఇచ్చిన ఈ వారం కెప్టెన్సీ టాస్క్ నియమ, నిబంధనలు చదివి వినిపిస్తుంది. ఈ టాస్క్ ఆడేందుకు అర్హత పొందాలంటే ఇంటి సభ్యులు కొనుక్కోవాల్సి ఉంటుంది.
గార్డెన్ ఏరియాలో బిబి ట్రాన్స్ పోర్ట్ వాహనం ఉంది. వాహనం ఆగిన ప్రతిసారి మొదటిగా వాహనంలోకి ఎక్కిన వారికి మాత్రమే కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశం లభిస్తుంది. ప్రతి స్టాప్ లో బిబి ట్రాన్స్ పోర్ట్ ఎక్కలేక పోయిన మిగతా ఇంటి సభ్యులు ఇద్దరి సభ్యులను ఎకాభిప్రాయంతో ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎవరు కెప్టెన్సీ పోటీలు ఉండాలి ఎవరు తొలగిపోవాలి అనేది ముందుగా బిబి ట్రాన్స్ పోర్ట్ వాహనాన్ని ముందుగా ఎక్కి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన సభ్యులు నిర్ణయిస్తారు.

అబ్బాయిలో రాజ్, అమ్మాయిల్లో కీర్తి అని శ్రీసత్య చెప్తుంది. ఇనయ ఇప్పటికీ ఇంటిని హ్యాండిల్ చేస్తుందని నాకు అనిపించడం లేదని రాజ్ అభిప్రాయపడతాడు. ఇలా ఎవరికి వాళ్లు ఎవరిని కెప్టెన్సీ పోటీదారుల నుండి ఎవరిని తొలగించాలి అనేది కూర్చోని డిస్కషన్ చేస్తారు. ఈ క్రమంలో కీర్తి, శ్రీహాన్ ఒకరిని ఒకరు వెటాకారంగా ఇమిటేషన్ చేసుకుంటారు. ఫైనల్ గా ముందు ఫైమా కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక నుండి తొలగిపోతుంది. తర్వాత రాజ్ తొలగిపోతాడు. తర్వాత తీసుకున్న ఏకాభిప్రాయంలో శ్రీసత్య, కీర్తి, మెరీనా తొలగిపోతారు. మొత్తానికి కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక టాస్క్ ముగిసినట్లు బిగ్ బాస్ ప్రకటిస్తాడు.
ఫైనల్ గా ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్, రోహిత్, ఇనయ శ్రీహాన్, శ్రీసత్య కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎంపిక అవుతారు. వీరిద్దరు ఎట్లాగూ మాట్లాడుకుంటారు.. మనం ఎలాగూ ఆటలో అరటిపండ్లు అయిపోయాము వీరి ఉద్దేశ్యంలో అని చెప్పేసి అని రేవంత్ ఏదో చెప్పబోతాడు. దీంతో ఆటలో అరటిపండు చేసేయడం అంటే ఏదో కావాలనే నేను చేసినట్లు వస్తుంది రా అని రేవంత్ పైన శ్రీహాన్ సీరియస్ అవుతాడు. ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నట్లు జనాలకు ఏదో అభిప్రాయం కలిగేలా చేస్తున్నావ్ నీవు అని శ్రీహాన్ అంటాడు. ఇప్పుడు ఏంటి నేను శ్రీహాన్ ఎక్కువ మాట్లాడకూడదు అంతేనా..వెళ్లి ఒక పది మందికి చెప్తున్నావ్ అని శ్రీసత్య కూడా రేవంత్ మీద కాస్త అరుస్తుంది. ఇంకోసారి రాంగ్ గా అంటే బావుండదు.. మీరు చెప్పిందే కరెక్ట్ కాదు… ఓ సారి పక్కవాళ్లు చెప్పేది కూడా వినాలి అనుకుంటూ రేవంత్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. తర్వాత మరలా రాత్రికి ఒంటరిగా ఉన్న శ్రీహాన్ దగ్గరికి వచ్చిన ఎందుకు అలా అనాల్సి వచ్చిందో వివరించే క్రమంలో ఎపిసోడ్ ముగుస్తుంది.