Bigg Boss Review: బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ లో ఎప్పటిలాగే గ్రాండ్ గా నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా మన టీవి ద్వారా హౌస్ సభ్యులతో కనెక్ట్ అవుతారు. రాగానే నామినేషన్స్ ఉన్న వారిలో ఒకరి సేవ్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేస్తాడు. అందులో ఫైమా, కీర్తి సేవ్ అవుతారు. ఇక సండే ఫన్ డే అంటూ ఇంటి సభ్యులను రెండు టీంలుగా విభజించి నాగార్జున ఓ గేమ్ స్టార్ట్ చేస్తాడు. గేమ్ పేరు పిక్షనరీ గేమ్ అని నాగార్జున చెప్తాడు. మేము బొమ్మ గీస్తే వీళ్లు చెప్పాలా సార్ అని ఫైమా డౌట్ అడుగుతుంది. లేదమ్మా నీవు బొమ్మ గీస్తే నేను చెప్తాను అని నాగార్జున ఫన్ చేస్తాడు. అందరూ నవ్వుకుంటారు.
గేమ్ సార్ట్ అవుతుంది. శ్రీసత్యకు జైలవకుశ వస్తుంది. దీంతో అక్కడ బోర్డుపైన బొమ్మ వేసి ఆ సినిమా పేరును మిగతా టీం సభ్యుల చేత చెప్పించే ప్రయత్నం చేస్తుంది. మూడు బొమ్మలు వేస్తుంది. శ్రీసత్య తన బొమ్మ వేసుకున్నట్లు ఉంది.. ఆ పక్కన శ్రీహాన్… ఆ పక్కన రేవంత్ అని నాగార్జున అంటాడు. అసలు ఏంటి అది అని శ్రీసత్యను అడగ్గా.. సార్ జై లవ కుశలో మొదటి బొమ్మ రావణ అని చెప్తుంది. ఓ నీ బొమ్మ రావణ అని నాగ్ అంటాడు. తర్వాత ఓసాంగ్ వస్తుంది. అందరి లేడీ హౌస్ మెంట్స్ తో ముఖ్యంగా శ్రీసత్యతో కలిసి ఆదిరెడ్డి సూపర్ గా డ్యాన్స్ వేసే ప్రయత్నం చేస్తాడు. అలా గేమ్ చాలా పన్నీగా సాగుతుంది.

మధ్యలో మరలా నామినేషన్స్ ప్రక్రియ కొనసాగిస్తారు. ఈసారి రేవంత్ సేఫ్ అవుతాడు. తర్వాత ప్లాస్మా మీద ఓ చైల్డ్ హుడ్ ఫోటో కనిపిస్తుంది.. బిగ్ బాస్ క్లూ అని నాగార్జున చెప్తాడు. ముందుగా స్క్రీన్ మీద ఓ ఫోటో కనిపిస్తుంది. దీంతో చెప్పడానికి రెడీగా ఉన్న శ్రీహాన్, రేవంత్ ఇద్దరిలో రేవంత్ అక్కడ ఉన్న గంట కొట్టి శ్రీసత్య సార్ అని చెప్తాడు. రాంగ్ అని నాగ్ చెప్పేస్తాడు. తప్పు చెప్పినందుకు నాలిక బయటపెట్టి ఒక తెలుగు పాట పాడాలని రేవంత్ కి నాగ్ పనిష్మెంట్ ఇస్తాడు. దీంతో తన నాలుకనుతన చేతితో పట్టుకుని రేవంత్ పాట పాడటానికి ట్రై చేస్తాడు. అలా గేమ్ కొనసాగుతుంది.
మధ్యలో మరోసారి నామినేషన్స్ ప్రక్రియ కొనసాగిస్తాడు. ఇందులో ఇనయ, ఆదిరెడ్డి సేఫ్ అవుతారు. తర్వాత మరలా గేమ్ స్టార్ట్ అవుతుంది. మధ్యలో మరలా జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో శ్రీహాన్ సేఫ్ అవుతాడు. చివరగా వాసంతి, మెరీనా ఉంటారు. ఈ ఇద్దరిలో ముందుగా అందరూ ఊహించని విధంగా మెరీనా కాకుండా వాసంతి ఎలిమినేట్ అవుతుంది. హౌస్ లో నుండి బిగ్ బాస్ స్టేజ్ మీదకు వస్తుంది. నాగార్జున వాసంతి జర్నీ ప్లే చేసి చూపిస్తారు. తర్వాత బెసట్ ఫ్రెండ్స్ ఎవరు అనేది చెప్పమని నాగార్జున అడుగుతాడు., మెరీనా, రేవంత్, ఇనయ, కీర్తి అని వాసంతి చెప్తుంది. మొత్తానికి వాసంతి బిగ్ బాస్ స్టేజ్ మీద నుండి బయటికి వెళ్లిపోతుంది. చివరగా ఈ సీజన్ లో చివరగా గెలిచే బిగ్ బాస్ విన్నర్ కి ప్రైజ్ మనీ రూ.0 లక్షలు అని నాగార్జున ప్రకటించడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.