Bigg Boss Review: బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ లో ముందుగా ఎప్పటిలాగే నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. శుక్రవారం ఏం జరిగిందో చూద్దాం అంటూ మన టివి ద్వారా బిగ్ బాస్ హౌస్ కి కనెక్ట్ అవుతాడు. ముందుగా శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్ మధ్యలో ఫన్నీ సంభాషన సాగుతుంది. తర్వాత జైలులో ఉన్న ఇనయ బయటకు వస్తుంది. కాసేపు పేయిడ్ ప్రమోషన్ జరుగుతుంది. తర్వాత బాలాదిత్య, రోహిత్ మధ్య సంభాషణను చూపిస్తారు.
తర్వాత మన టివి ద్వారా హౌస్ సభ్యులతో కనెక్ట్ అవతాడు. మందుగా కెప్టెన్ గా ఎంపికైన ఫైమాకు శుభాకాంక్షలు చెపుతాడు. బాలాదిత్య సిగరెట్లు మానేయడంపై నాగార్జున హర్షం వ్యక్తం చేశాడు. తర్వాత ఎవరు ఎలాంటి వాళ్లు అనేది ఓ డాక్టర్ గా చెప్పాలనే టాస్క్ హౌస్ సభ్యులకు ఇస్తాడు. దీంతో గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ మధ్యలో రేవంత్ మీద ఫిర్యాదులు ఉంటే చెప్పమని నాగార్జున అడుగుతాడు. కాసేపు రేవంత్ సంచాలకుడిగా వ్యవహరించిన తీరుపై డిస్కషన్ జరిగింది.

తర్వాత ఎవరెవరికి ఏ రోగం ఉంది అనేది ఒకరి తర్వాత ఒకరు తోటి హౌస్ సభ్యులు ట్యాగ్స్ ఇస్తూ వివరణ ఇస్తారు. ఇనయకు కాసేపు నాగార్జున క్లాస్ పీకుతాడు. మాటలు మాట్లాడే గురించి నాగార్జున తప్పుబడతాడు. టాస్క్ మధ్యలో నాగార్జున బ్రేక్ తీసుకున్న సమయంలో రాజ్ తో ఇనయ కాసేపు వాదనలు జరుగుతాయి. తర్వాత మరలా టాస్క్ కంటిన్యూ అవుతుంది. శ్రీసత్య పెద్ద మ్యానిప్లేటర్ అని నాగార్జున స్టేట్ మెంట్ ఇస్తాడు. బ్రేక్ తర్వాత ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటిస్తారు. బ్రేక్ తర్వాత హౌస్ సభ్యులతో నాగార్జున కనెక్ట్ అవుతాడు.
నామినేషన్స్ లో ఉన్న వాళ్లను నిలబెట్టి నామినేషన్ ప్రక్రియ స్టార్ట చేస్తాడు. బాలాదిత్య ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటిస్తాడు. దీంతో హౌస్ లో అందరూ షాక్ అవుతారు. అందరూ బాలాదిత్యకు సెంట్ ఆఫ్ ఇస్తారు. బిగ్ బాస్ స్టేజ్ పైకి బాలాదిత్య వెళ్లిపోతాడు. బాలాదిత్య జర్నీ చూపిస్తారు. హౌస్ సభ్యుల వీక్ నెస్ ఏంటి.. అవి అధిగమించాలంటే ఏం చేయాలనేది చెప్పాలని బాలాదిత్యకు నాగార్జున చెప్తాడు. దీంతో బాలాదిత్య హౌస్ సభ్యుల వీక్ నెస్ చెప్పి దాన్ని అధిగమించడం ఎలా అనేది కూడా వివరిస్తాడు.నామినేషన్స్ లో ఇంకా ఎనిమిది మంది ఉన్నారు రేపు కలుద్దాం అంటూ నాగార్జున ఈరోజు ఎపిసోడ్ ముగించేస్తాడు.