Bigg Boss Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఈరోజు గురువారం ఎపిసోడ్ కి సంబంధించి ముందుగా రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్ మధ్య జరిగిన సంభాషణతో స్టార్ట్ అవుతుంది. నేను నా తలకాయ్ అక్కడ ఉందని చెప్పాను కదా.. నేను ఆడను అని వెళ్లిపోతే ఎవరికైనా కోపం వస్తుంది కదా.. అందరూ గెలవాలనే ఆడతారు కదా అని రేవంత్ తో శ్రీసత్య అంటుంది. అంతా బూడిదలో పోసిన పన్నీరులా అయిపోయిందని రేవంత్ అంటాడు. అక్కడి నుండి శ్రీసత్య, రేవంత్ ఇద్దరూ వెళ్లిపోతారు. అంత కష్టపడి పట్టి తెచ్చి అందరి కన్నా ఎక్కువ మట్టి సాధించినా కూడా నాకు ప్రతిఫలం రాలేదు అని రేవంత్ తనలో తానే మాట్లాడుకుంటాడు.
బ్రో ఎక్కువగా రియాక్ట్ అవ్వద్దు బ్రో ప్లీజ్ అంటూ రేవంత్ కళ్లు తూడుస్తాడు ఆదిరెడ్డి. ఐయామ్ ఏ లూసర్ అని రేవంత్ తనని తాను అనుకుంటాడు. అందరూ అనుకుని నీకు ఇచ్చారు… నీవు గెలవాలి ఎలా గెలవాలంటే దెబ్బకు కెప్టెన్ అవ్వాలి అని మెరీనాతో రేవంత్ చెప్తాడు. మెరీనా కూడా రేవంత్ కన్నీళ్లు తూడుస్తుంది. ఎప్పుడూ అంత అగ్రెసీవ్ అనుకున్న నేనే ఇవాళ గేమ్ ఆడలేపోయాను అంటే.. నాలా నేను లేనప్పుడు ఐ ఫెల్ట్ బ్యాడ్ అని ఇనయ, శ్రీసత్యతో రేవంత్ చెప్తాడు.

రేవంత్ బాగా హర్ట్ అయినట్లు ఉన్నాడు ఏ విషయం మీదనో అని వాసంతి కూడా మెరీనాతో అంటుంది. ఇలా ఉంటే జనాలకు కూడా ఏం నచ్చుతావ్ రేవంత్ అని శ్రీసత్య అంటుంది. ఎవరికీ నచ్చ కూడదూ అని చెప్పి రూల్ ఏమీ లేదు కదా… పోనీ నీవు రీజన్ చెప్పక్కర్లేదు.. ప్రాబ్లమ్ నీతోనే అని చెప్తే నేను మాట్లాడను ఇక అని శ్రీసత్య అంటుంది. నాకు నాతోనే ప్రాబ్లమ్ అని రేవంత్ సమాధానం ఇస్తాడు. చివరగా కన్ఫెషన్ రూంకి రావాలని రేవంత్ ను బిగ్ బాస్ పిలుస్తాడు. కన్ఫెషన్ రూం డోర్ తీసుకుని లోపలికి వెళ్లడంతో ప్రోమో ముగుస్తుంది. మరి అక్కడ బిగ్ తో రేవంత్ ఏం మాట్లాడతాడు. ఈ వారం కెప్టెన్సీ పోటీదారులకు ఇస్తున్న కెప్టెన్సీ టాస్క్ వస్తా నీవెనుక అని రేవంత్ రూల్స్ చదివి వినిపిస్తాడు. గేమ్ స్టార్ట్ అవుతుంది.
ఈ గేమ్ లో కీర్తీ, మెరీనా, రోహిత్ ముగ్గురూ పోటీనుండి తొలగిపోతారు. రోహిత్ తొలగిపోయే క్రమంలో బాగానే రచ్చ నడుస్తుంది. సంచాలకుడిగా రేవంత్ తీసుకున్న నిర్ణయంపైన రోహిత్ అసహనం వ్యక్తం చేస్తాడు. కాసేపు గేమ్ కు సంబంధించి అందరి మధ్య జరిగిన సంభాషణతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక గేమ్ లో శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమా ముగ్గురు మాత్రమే ఉన్నారు. మరి ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అవుతారు అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే.