Bigg Boss Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో శుక్రవారం కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతోంది. బుద్ది బలంతో ఆదిరెడ్డికి కోపం వచ్చేలా గీతూ గేమ్ ఆడుతుంది. ఈ క్రమంలో ఆదిరెడ్డి, గీతూకి మధ్య మాటల యుధ్దం సాగుతుంది. తర్వాత గేమ్ లో భాగంగా ఆడటం స్టార్ట్ చేస్తారు. ఇనయ, రేవంత్ మధ్య తోసుకునేంత దూరం వెళ్తుంది. అందరి మధ్య పోరు సాగుతున్న సమయంలో గేమ్ పాస్ చేయబడిందని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. గేమ్ పాస్ అయిన తర్వాత కూడా ఫైమా, రాజ్ మధ్య మాటల యుద్దం నడుస్తుంది.
ఇంటెన్షన్ గా నన్ను టార్గెట్ చేశారంటూ ఇనయ అంటుంది. ఇంటెన్షన్ గురించి నీవు మాట్లాడుతున్నావా ఇనయ అంటూ సూర్య వెటకారం చేస్తాడు. కాసేపు రెండు టీంల మధ్య గేమ్ గురించి ఒకరిని ఒకరు తప్పుబట్టుకుంటారు. తర్వాత గీతూ, ఫైమా, సూర్య, కీర్తి అందరూ కలిసి ఆదిరెడ్డికి క్షమాపణ చెప్తారు. గేమ్ లో భాగంగా అలా చేశామని అంటారు. ఈ టాస్క్ లో చనిపోయిన సభ్యులు భౌతికంగా పాల్గొనలేరు అని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. కానీ ఆదిరెడ్డి మైక్ ని డ్యామేజ్ చేసినందుకు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుండి తొలగిస్తాడు బిగ్ బాస్. ఇంతటితో మిషన్ పాజిబుల్ టాస్క్ పూర్తి అయిందని బిగ్ బాస్ ప్రకటిస్తాడు.

కెప్టెన్సీ కంటెంటర్ నుండి తొలగించినందుకు బిగ్ బాస్ పైన కూడా ఆదిరెడ్డి ఫైర్ అవుతాడు. గీతూ మరోసారి ఆదిరెడ్డికి క్షమాపణ చెప్తుంది. ఇక రాత్రి ఇనయ, గీతూ ఒంటరిగా బిగ్ బాస్ తో మాట్లాడుకుంటారు. ఆదిరెడ్డిని అర్ధరాత్రి లేపి క్షమాపణ చెప్పి గార్డెన్ ఏరియాలోకి మాట్లాడేందుకు తీసుకువస్తుంది. రాత్రి అక్కడే మాట్లాడకుంటూ పడుకుంటారు. మిషన్ పాజిబుల్ టాస్క్ డ్రా అవుతుంది.
కెప్టెన్సీ పోటీదారులుగా రెండు టీం నుండి ఎన్నుకుంటారు. అందరూ అమ్మాయిలనే ఎంపిక చేస్తారు. కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైన వారికి బెలూన్ గేమ్ పెడతాడు బిగ్ బాస్. గేమ్ స్టార్ట్ అవుతుంది. ఒకరి బెలూన్ ఒకరు పగులగొట్టేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో అందరూ బాగానే ప్రయత్నం చేస్తారు. ఈ గేమ్ లో శ్రీసత్య గెలుస్తుంది. హౌస్ కి ఈ వారం కెప్టెన్ గా శ్రీసత్యగా ఎంపిక అయింది. శ్రీసత్య కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరిస్తుంది. తర్వాత కాసేపు అందరూ వారి వారి గేమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.