BIGG BOSS: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో సింగర్ రేవంత్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు. ఈ సీజన్ లో హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో రేవంత్ ఒకరు అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి నామినేషన్ లో రేవంత్ ఉన్నారు. కానీ నామినేషన్ నుండి రేవంత్ సేవ్ అవుతూ వస్తున్నారు. ఇక హౌస్ లో కెప్టెన్ అవ్వాలని రేవంత్ కి బలమైన కోరిక ఉంది. ఇందు కోసం శతవిధాలుగా ప్రతయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ కోరిక మాత్రం ఇంకా నెరవేరలేదు.
ప్ర్తుతం నాగులో వారం బిగ్ బాస్ సీజన్ సిక్స్ కొనసాగుతోంది. ఈ వారం కూడా కెప్టెన్ పోటీదారుడి టాస్క్ నుండి రేవంత్ తొలగిపోతాడు. ఈ క్రమంలో గురువారం ఎపిసోడ్ లో రేవంత్ కి బిగ్ బాస్ ఓ సర్ ప్రైజ్ ఇస్తాడు. రేవంత్ ఒక్కడినే గార్డెన్ ఏరియాలోకి రమ్మని పిలుస్తాడు బిగ్ బాస్. మునుపటి వారం రేవంత్ భార్య శ్రీమంతం జరిగింది. ఆ వేడుకలో స్వయంగా పాలుపంచుకోలేకపోయారు కావున ఈ మధుర క్షణాలను బిగ్ బాస్ మీకు చూపించాలని అనుకుంటున్నారని చెప్తాడు.

గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన టీవిలో రేవంత్ భార్య శ్రీమంతానికి సంబంధించిన విజువల్స్ ని వేస్తారు. రేవంత్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ వీడియోను చూస్తాడు. బిగ్ బాస్ కి ధ్యాంక్స్ చెప్పి అక్కడే పక్కన కూర్చుని కాసేపు తన బాధను చెప్పుకుంటాడు. తన భార్య ఆరోగ్యంగా ఉంది అదే చాలు నాకు.. ఇక నేను కష్టపడి ఆడి బిగ్ బాస్ టైటిల్ ను తీసుకెళ్లి మా ఆవిడకి ఇవ్వాలి. అందుకు ఎంత కష్టమైనా భరిస్తా అని తనలో తానే అనుకుంటాడు. అక్కడే ఉన్న పళ్లు, స్వీట్స్ మరియు ఇతర వస్తువులు నుండి మీ భార్యకు ఏవైతే పంపాలనుకుంటున్నారో వాటిని ఎంపిక చేసి ఒక పళ్లెంలో పెట్టి మీ భార్యకు మీ దీవెనలు తెలియజేయాలని చెప్తాడు.
రేవంత్ తోటి కంటెస్టెంట్స్ అందరినీ తన దగ్గరకు రమ్మని పిలుస్తాడు. అందరూ వచ్చి రేవంత్ కు కంగ్రాట్స్ చెప్తారు. తనభార్యకు పంపిచాల్సిన వాటిని ఒక పళ్లెంలో ఉంచి బిగ్ బాస్ ద్వారా పంపిస్తారు. రేవంత్ ఆనందాన్ని తోటి కంటెస్టెంట్స్ అందరూ పాలుపంచుకుని కాసేపు మధుర క్షణాలను పంచుకోవడం జరుగుతుంది. చివరగా తన భార్య కోసం ఓ పాఠను పాడతాడు రేవంత్.