Bigg Boss Secrets: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమం అన్ని భాషలలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని దూసుకుపోతుంది. అయితే తెలుగులో ఈ కార్యక్రమం ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ఆరవ సీజన్ ప్రసారమవుతుంది.ఇకపోతే ఈ కార్యక్రమం ఇప్పటికి నాలుగు వారాలను పూర్తి చేసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్లు బయటకు వచ్చారు.
ఇలా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని ఈ కార్యక్రమం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని అందరూ భావిస్తారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు బిగ్ బాస్ సీక్రెట్స్ అన్ని బయట పెట్టారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్టెంట్ లు ఆకలి కేకలతో అలమటించాలని షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక్కడ ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఏమీ ఉండదు కేవలం ఒక ఐదు రకాల ఫ్రూట్స్ మాత్రమే పంపిస్తారు ఒక్కొక్కరు ఒక్కో ఫ్రూట్ మాత్రమే తినాలని కంటెస్టెంట్లు వెల్లడిస్తున్నారు. అదేవిధంగా రోజుకొక ఏదో ఒక ఫ్రూట్ తినడమే తమ టిఫిన్ అంటూ కంటెస్టెంట్లు చెప్పుకొచ్చారు.
Bigg Boss Secrets: ఆకలికి తట్టుకోలేక ఫుడ్ దొంగలిస్తారు..
అదేవిధంగా ఒక్కొక్క కంటెస్టెంట్కు వన్ వీక్ కి 5 ఎగ్స్ ఇస్తారని, అయితే ఇతర కంటెస్టెంట్ లో ఆకలికి తట్టుకోలేక ఇతరుల ఫుడ్ కూడా దొంగతనం చేస్తారని తెలియజేశారు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఆకలితో బాధపడాల్సిందేనంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తెలుగులో ఇప్పటికే నాలుగు వారాలు పూర్తికాగా హౌస్ నుంచి షాని, అభినయశ్రీ, నేహా, ఆరోహి వరుసగా ఎలిమినేట్ అయ్యారు.