Bigg Boss Season 6 Review: బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రియాల్టీ షోలలో ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ షో కి మంచి పేరుంది. ఎంతటి సెలబ్రిటీ అయినా ఈ షోలో ఏమాత్రం తేడా చేస్తే గాలి మొత్తం పోతది. ఎంతటి సామాన్యుడైన షోలో ఏమాత్రం.. గట్టిగా రాణించాడు అంటే.. కెరియర్ పరంగా తిరుగు ఉండదు. ఎంతోమంది డ్రీమ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని ఉంటది.
కానీ కొంతమందికి మాత్రమే అదృష్టం వరిస్తది. అయితే ఈసారి ఏకంగా 20 మందికి అదృష్టం వరించడం జరిగింది. వాళ్ల లిస్టు చూస్తే కీర్తి కేశవ్ భట్, పింకీ, సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్, యాంకర్ నేహా చౌదరి, చలాకి చంటి, నటి శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గీత రాయల్, అభినయశ్రీ, కపుల్స్ జంట రోహిత్ ..మెరీనా, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ, ఇనయా సుల్తానా, ఆర్జె సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహి రావ్, సింగర్ రేవంత్. మొత్తం 20 మంది కంటెస్టెంట్ లని తొలిరోజే హౌస్ లోకి పంపించారు.
హైలెట్స్: హోస్ట్ గా నాగార్జున కొద్దిగా స్టైల్ మార్చినట్లు అర్థమవుతుంది. యాంకరింగ్ పరంగా బోల్డ్ గా ప్రశ్నలు అడగటం మరి వలిగారిటీ లేకుండా.. ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశారు. కపుల్స్ జంటగా వచ్చిన రోహిత్.. మెరీనా తో నాగ్ ఆడిపించిన గేమ్.. ఎంతగానో ఆకట్టుకుంది. ఇంకా చాలామంది కంటెస్టెంట్లను వాళ్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రశ్నలు వేస్తూ అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశారు.
మధ్యతరగతి వంటి కుటుంబాల నుండి వచ్చిన వారిని సైతం తనదైన శైలిలో ఎక్కడా కూడా స్టేజ్ ఫియర్.. వారిలో లేకుండా హౌస్ లో కూడా అద్భుతంగా ఆడేలా నాగ్ ప్రోత్సహించిన విధానం.. ఎంతోమందిని ఆకట్టుకుంది. కంటెస్టెంట్లతో రకరకాల గేమ్ ఆడిపిస్తూ హౌస్ లోకి వారిని పంపి.. మొదటి రోజే షోపై మరింత ఇంట్రెస్ట్ కలిగేలా హోస్ట్ గా నాగార్జున న్యాయం చేశాడని చెప్పవచ్చు.

కంటెస్టెంట్ల పరంగా చూసుకుంటే కొంతమంది కష్టాలు చెబితే మరి కొంతమంది కచ్చితంగా తామేంటో తెలుస్తుందని హౌస్ లోకి వెళుతున్నట్లు చెప్పుకొచ్చారు. మరి కొంతమంది పోటీ దారులు తమ డ్రీమ్ ఏంటో తెలియజేసి హౌస్ లో రాణించాలని ఆ డబ్బుతో.. తమ కల నెరవేర్చుకోవడానికి గేమ్ ఆడుతున్నట్లు పేర్కొన్నారు.
తొలి రోజే సీజన్ సిక్స్ బిగ్ బాస్ షో పరవాలేదు అనిపించింది. ఒకపక్క ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న కాని మరోపక్క షోకి మంచిగానే రెస్పాన్స్ రావడం విశేషం. దాదాపు 100 రోజులకు పైగా జరగనున్న ఈ షోలో… ఎన్ని గొడవలు అవుతాయో..? ఎంతమంది న్యూస్ చానల్స్ లో వైరల్ అవుతారో..? ఆఖరికి టైటిల్ ఎవరికి వరిస్తుందో.. చూడాలి.

Bigg Boss season 6 Grand launch review: బిగ్ బాస్ ఎన్ని గొడవలు పెడతాడో..?
ఇదే సమయంలో ప్రశాంతంగా ఉన్న బిగ్ బాస్ హౌస్ లో… బిగ్ బాస్ ఎన్ని గొడవలు పెడతాడో..? ఎన్ని జంటలు కలుస్తాయో.. రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఏకంగా ఈసారి గతంలో మాదిరిగా కాకుండా 20 మంది సభ్యులను హౌస్ లోకి పంపించటం.. సంచలనంగా మారింది. అంతేకాకుండా గత సీజన్ లలో వయసు పైబడిన వాళ్లకి అవకాశం ఇచ్చారు. కానీ ఈసారి హౌస్ లో మొత్తం అంతా యంగ్ బ్లడ్. మరి హౌస్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అవుతుందో చూడాలి.