Bigg Boss Season 6: బిగ్ బాస్ స్టేజ్ మీద బ్రహ్మాస్త్ర టీం ప్రమోషన్స్ మొదటి నుంచి జరుగుతూనే వస్తోంది. అయితే ఈ సారి కూడా బిగ్ బాస్ టీం స్టేజ్ మీదకు వచ్చింది. బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జునతో కలిసి రణ్ బీర్ కపూర్, అలియా భట్ సందడి చేశాడు. ఇక అలియా భట్ పాట పాడటం, రణ్ బీర్ తెలుగులో మాట్లాడటంతో నాగార్జున మురిసిపోయాడు. ఆ తరువాత నాగార్జున కూడా హిందీలో అలియా భట్‌తో కలిసి పాట పాడాడు.
బ్రహ్మాస్త్ర టైం కంటే ముందే మీ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందా? అని నాగార్జున అడిగాడు. దానికి అలియా భట్ అవును అని సమాధానం ఇచ్చింది. మామూలుగానే రణ్ బీర్ నటన అంటే ఇష్టం.. ఆయన కళ్లలోనే అన్ని కనిపిస్తాయి. ఆ కళ్లలోనే నిజాయితీ ఉంటుంది.. అందుకే రణ్ బీర్ కపూర్ అంటే నాకు ఇష్టం అని అలియా భట్ అసలు విషయం చెప్పింది.
అయితే అలియా భట్ గురించి రణ్ బీర్ కపూర్ చెప్పుకొచ్చాడు. ఆమెను మొదట ఎప్పుడు చూశాడో గుర్తు పెట్టుకుని మరీ డేట్ చెప్పాడు. హైవే సినిమా చూసిన క్షణంలో.. మరో అమితాబ్ బచ్చన్ దొరికిందని అనుకున్నాం.. మా జనరేషన్లో ఇలాంటి నటి ఇంకొకరు లేరు అంటూ అలియా భట్ గురించి రణ్ బీర్ కపూర్ ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు.
Bigg Boss Season 6: నాగార్జున కాళ్లు మొక్కిన రణ్‌బీర్ …
త్వరలోనే మీ ఇద్దరికీ మంచి పిల్లాడు పుట్టాలని మీ అంత ఎత్తుకు ఎదగాలని.. మీకంటే ఎత్తుకు ఎదగాలని నాగార్జున కోరుకున్నాడు. దీంతో స్టేజ్ మీదే నాగార్జున కాళ్లను మొక్కేశాడు రణ్ బీర్ కపూర్. మొత్తానికి ఈ జంట మాత్రం త్వరలోనే పేరెంట్స్ కాబోతోన్నారని ఇలా బయటకు వచ్చేసింది.