Bigg Boss Season 6 Episode 13 Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 13వ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగింది. హౌస్ లో రెండో కెప్టెన్ ఎన్నిక ప్రక్రియ కంటిన్యూ చేస్తూ.. “నాచే నాచే” టాస్క్ లో భాగంగా వచ్చే పాటలకు ఇంటి సభ్యులు డాన్స్ వేయడం జరిగింది. ఆల్రెడీ నిన్న రాజ్ కి గీతు- రేవంత్, శ్రీ సత్య వాసంతి, శ్రీహాన్ -షానీ మద్దతు తెలిపారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో సుదీప-కీర్తి, అభినయశ్రీ- ఆదిత్య.. మద్దతు తెలపడంతో రెండో వారం కెప్టెన్ గా రాజ్ ఎంపికయ్యాడు. ఈ ప్రక్రియలో సూర్యకి రెండు ఓట్లు, చంటి, సుల్తానాకి ఒక ఓటు రావడం జరిగింది. ఓటింగ్ ప్రక్రియలో భాగంగా మధ్యలో సుల్తానా కన్నీటి పర్యంతమైంది. కష్టపడి టాస్క్ లు ఆడాను. కానీ ఇంటిలో ఎవరూ కూడా నాకు ఓట్లేయలేదు. కనీసం నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. రాబోయే రోజుల్లో మరింతగా బాగా ఆడతానంటూ వాసంతి, చంటి, ఫైమా వద్ద తన బాధ చెప్పుకోంది. ఈ క్రమంలో చంటి…బాధపడుతున్న సుల్తానా నీ కొద్దిగా ఓదార్చడం జరిగింది.
ఆ తర్వాత గీతు.. ఆదిరెడ్డి డిస్కషన్ పెట్టుకుని హౌస్ లో పరిస్థితి గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. హౌస్ లో మనం అనుకున్నట్టు ఎవరు అమాయకులు కాదు, ఎవరు గేమ్ తెలియని వాళ్ళు లేరు. ఎవరికివారు గేమ్ తమ ప్లానింగ్ తో ఆడుతున్నారు అని ఆదిరెడ్డి డైలాగులు వేశారు. ఆ తర్వాత కొత్త కెప్టెన్ అయినా రాజ్ నీ బిగ్ బాస్ అభినందించారు. అనంతరం రాజ్ ఇంటి సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ… నేను కెప్టెన్ కావడానికి ప్రధాన కారణం నా తోటి కెప్టెన్ పోటీదారులు. అదేవిధంగా హెల్దీ వాతావరణంలో నేను చెప్పేది అందరూ పాటించాలి. పనిష్మెంట్లు ఇచ్చుకునేదాకా ఎవరు పరిస్థితిని తీసుకెళ్లొద్దు. చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో మీకు చెబుతాను. దయచేసి.. నాకు సహకరించండి. కెప్టెన్ బ్యాడ్జ్ కి ఇంటి సభ్యులు గౌరవం ఇవ్వండి. ఆ తర్వాత “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” సినిమా హీరో సుధీర్ బాబు, హీరోయిన్ కృతి శెట్టి హౌస్ లోకి రావడం జరిగింది.
ఈ సందర్భంగా ఇంటి సభ్యులతో కొద్దిగా సినిమా గురుంచి ముచ్చట్లు చెప్పడం జరిగింది. అనంతరం హౌస్ లో “బెస్ట్ యాక్టర్… బెస్ట్ హీరోయిన్” అవార్డు టాస్క్ పెట్టారు. దీనిలో భాగంగా రకరకాల టాస్కులు ఇంటి సభ్యులకు సుధీర్ బాబు ఇంకా కృత్తి శెట్టి ఇవ్వడం జరిగింది. దీంతో ఫస్ట్ రేవంత్… మహేష్ బాబు నటించిన “పోకిరి”లో “ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు” అనే డైలాగ్ రెండు రకాలుగా చెప్పాడు. ఆ తర్వాత గీతు రాయల్ “బుజ్జిగాడు” సినిమాలో డైలాగులు ప్రభాస్ లాగా ఇంకా తన సొంత స్టైల్లో చాలా కామెడీ పండిస్తూ చెప్పింది. సూర్య వచ్చి “గబ్బర్ సింగ్” లో పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ వాయిస్ తో దింపేశాడు. అనంతరం “పోకిరి” సినిమాలో లిఫ్ట్ సీన్.. నీ బిగ్ బాస్ హౌస్ లో ఉండే పరిస్థితులకి అనుగుణంగా శ్రీహాన్, గీతు రాయల్, ఫైమా, ఆదిరెడ్డి, సూర్య, రాజ్ చేశారు. ఈ స్కిట్ లో శ్రీహాన్ మరియు ఫైమా మధ్య అద్భుతమైన కామెడీ పండింది. అనంతరం “వెంకీ” సినిమాలో ట్రైన్ సీన్.. విజయ్ దేవరకొండ వాయిస్ తో సూర్య చేసి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అందించడం జరిగింది.
ఈ స్కిట్ లో బ్రహ్మానందం గా చంటి రెచ్చిపోయాడు. అనంతరం సుధీర్ బాబు ఒక సీన్ చెప్పడం జరిగింది. ఒక అమ్మాయికి దయ్యం పడుతూ ఉంటది. అదే సమయంలో అబ్బాయి ప్రపోజ్ చేస్తాడు.. అని సీన్ చెప్పడం జరిగింది. ఈ సీన్ లో ప్రపోజ్ చేసే అబ్బాయిగా రాజ్… దెయ్యం పట్టిన అమ్మాయిగా శ్రీ సత్య స్కిట్ చేశారు. మధ్యలో శ్రీహాన్ రావడం… దెయ్యం పట్టిన అమ్మాయిగా శ్రీ సత్య వేసిన డైలాగులు కామెడీ పండేటట్లు చేశాయి. అన్ని స్కిట్లు అయిపోయినాక.. బెస్ట్ యాక్టర్ అవార్డు శ్రీహాన్, బెస్ట్ హీరోయిన్ అవార్డు శ్రీ సత్యకి.. సుధీర్ బాబు మరియు కృతి శెట్టి ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీహాన్ ఇదే తన లైఫ్ లో ఫస్ట్ అవార్డు అని చెప్పుకొచ్చాడు. అనంతరం ఇంటి సభ్యులకు హీరో హీరోయిన్ గుడ్ బై చెప్పడం జరిగింది. ఆ తర్వాత రేవంత్.. ఆదిత్య వద్ద డిస్కషన్ పెట్టాడు. తనకి పైమా, చంటి విధానం నచ్చటం లేదని రచ్చ రచ్చ చేశాడు. ఆ తర్వాత సుల్తానా… ఇంటిలో అందరూ నచ్చుతున్న గాని రేవంత్ మాట్లాడే విధానం వ్యవహార శైలి అసలు నచ్చటం లేదని వాసంతి దగ్గర చెప్పింది. ఈ రీతిగా 13వ ఎపిసోడ్ ముగిసింది.