Bigg Boss Season 6 Day 9 Second Promo: బిగ్ బాస్ సీజన్ సిక్స్ సోమవారం ఎపిసోడ్ లో రెండవ వారం ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. 8 మంది ఇంటి నుండి ఎలిమినేట్ కావడానికి నామినేట్ అయ్యారు. అయితే మంగళవారం రెండోవారం కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. మంగళవారం ఎపిసోడ్ కి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ ప్రోమోలో.. ఇంటి సభ్యులకీ రెండో వారం కెప్టెన్ అవటానికి “సిసింద్రీ టాస్క్” నిర్వహించారు. ఈ క్రమంలో ఇంటి సభ్యులందరికీ ఒక బేబీ బొమ్మని ఇవ్వటం జరిగింది.
ఆ బొమ్మకి ఆలనా పాలనా చూసుకుంటూ మరోపక్క..బిగ్ బాస్ పెట్టే టాస్క్ ఆడాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో “సిసింద్రీ టాస్క్” లో “సక్స్ అండ్ షేప్స్” చాలెంజింగ్ టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ లో రేవంత్, గీతు, చంటి, ఫైమా, ఆరోహి పోటీపడ్డారు. నేహా చౌదరి సంచాలక్ గా వ్యవహరించింది. అయితే ఈ టాస్క్ లో చంటి గెలిచినట్లు ప్రోమోలో చూపించారు. ఇదే సమయంలో తనని అందరూ టార్గెట్ చేసి ఓడించారని రేవంత్ కేకలు వేయడం.. ప్రోమోలో సంచలనం రేపింది.
ఫైమా… రేవంత్ ఓడిపోవడానికి కారణం అని అభినయశ్రీ కూడా డైలాగులు వేసింది. ఈ క్రమంలో తానే నిజమైన ఫైటర్ అని రేవంత్.. ఆదిరెడ్డికి టాస్క్ అయిపోయాక చాలా కోపంగా చెప్పారు. ఇక ఇదే సమయంలో ఫైమా సైతం రేవంత్ కి కౌంటర్లు వేయడం ప్రోమోలో చూపించారు.