Bigg Boss Season 6 Day 8 Second Promo: బిగ్ బాస్ సీజన్ సిక్స్ సోమవారం ఎపిసోడ్ కి సంబంధించి రెండో ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో గీతుకి అదే విధంగా రేవంత్ కి మధ్య గట్టిగానే గొడవ జరిగింది. రేవంత్ ఆవేశానికి లోనై ఎగస్ట్రాలు మాట్లాడొద్దని గీతుకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. గీతు సైతం రెచ్చగొట్టే విధంగా వ్యవహరించింది. ఇక ఇదే సమయంలో బాలాదిత్యకి రేవంత్ కి కూడా గొడవ జరిగింది. షానీతో కూడా బాలాదిత్యకి సోమవారం ఎలిమినేషన్ నామినేషన్ ఎపిసోడ్ లో గొడవ జరగటం ప్రోమోలో చూపించారు.
గీతుతో మరొక కంటెస్టెంట్ చంటి సైతం గొడవకు దిగి ఆమెను నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడో సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తుంది అని రీజన్ చెప్పి శ్రీ సత్య సైతం షానినీ నామినేట్ చేసింది. ఇంకా షాని నటిస్తున్నట్లు ఇంటి సభ్యులు చెప్పిన కారణాలను నామినేషన్ ల ప్రస్తావించి.. నేను జన్యున్ గానే గేమ్ ఆడుతున్నాను. నేను ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటాను.
మీకు అప్షన్ ఉంటే… కావాలనుకుంటే కోపం తెప్పించండి అంటూ చాలా ఎటకారంగా నామినేషన్ టైములో షాని కామెంట్లు చేయడం జరిగింది.ఇంక సుల్తానాకి ఆదిరెడ్డికి మధ్య కూడా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆదిరెడ్డి పొద్దున విడుదల చేసిన ప్రోమోలో కీర్తికి గట్టిగా కౌంటర్ వేస్తే రెండో ప్రోమోలో సుల్తానాకి కౌంటర్ వేశారు. నన్ను 15 వారాలలో ఎన్నిసార్లు నామినేషన్ చేసిన నేను కేర్ చేయను అని ఆదిరెడ్డి చాలా పెద్ద డైలాగులు వేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే బిగ్ బాస్ రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియకి సంబంధించి పొద్దున రిలీజ్ అయిన ప్రోమోలో మధ్యాహ్నం రిలీజ్ అయిన ప్రోమోలో ఇంటి సభ్యులు గీతూనే గట్టిగా టార్గెట్ చేశారు.