Bigg Boss Season 6 Day 8 Highlights: బిగ్ బాస్ సీజన్ 6 సోమవారం ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. ఆదివారం ఎపిసోడ్ లో నో ఎలిమినేషన్ కావటంతో హౌస్ లో అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే సోమవారం ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఆదివారం ఎపిసోడ్ లో ఆరోహి, అభినయశ్రీ, సుల్తానా ముగ్గురు మిగిలాక ఆ టైంలో.. నాగార్జున ముగ్గురిపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని చెప్పడం తెలిసిందే. దీంతో ఆ టైమ్ లో ఆరోహి గురించి మాట్లాడిన సంభాషణ.. సోమవారం ఎపిసోడ్ స్టార్టింగ్ లో చంటి, అభినయశ్రీ దగ్గర సూర్య లేవనెత్తారు.
ఆ సంభాషణ అయిపోయాక ఆరోహి నువ్వు కూడా ఒక ప్లేయర్ కదా మొహం మీదే డైలాగేసింది భయ్యా.. నాకు చాలా బాధనిపించింది అని సూర్య ఆ ఇద్దరికీ తన బాధ తెలియజేశారు. దీంతో తప్పుగా అర్థం చేసుకుంటే ఎవరు ఏమి చేయలేరని చంటి ఓదార్చారు. ఈ పరిణామంతో సోమవారం ఎపిసోడ్లో ఆరోహి.. సూర్య మధ్య మాటలు లేకుండా పోయాయి. దీంతో ఆరోహి కోపం వచ్చి.. సూర్య మైక్ దాచేసింది.
అయితే అదే సమయంలో అనుకోకుండా సుల్తానా మైక్ సూర్య వేసుకోవడం జరిగింది. దీంతో సుల్తానా తన మైకు పోయిందని.. బిగ్ బాస్ హౌస్ లో కెమెరాలు ముందు.. తన బాధను వెళ్ళబుచుకుంది. అనంతరం సూర్య దగ్గర తన మైకు దొరకడంతో వెంటనే కెప్టెన్ బాలాదిత్య వద్దకు వెళ్లి.. సూర్యకి పనిష్మెంట్ ఇవ్వాలని సుల్తానా కోరింది. అనంతరం ఉన్న కొద్ది మైకు గొడవ హౌస్ లో పెరగడంతో వెంటనే ఆరోహి.. శ్రీహాన్ నీ వెంటబెట్టుకుని వెళ్లి.. బాత్రూం వద్ద కబోర్డ్ రూమ్ లో దాచిన మైకు సూర్యకి.. ఇప్పించేసింది.