Bigg Boss Season 6 Day 8 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ సోమవారం జరిగిన ఎపిసోడ్ లో రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ సాగింది. గతంలో ఒక్కో సభ్యుడు ఇద్దరినీ నామినేట్ చేయగా.. ఫస్ట్ టైం సీజన్ సిక్స్ రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో ఒక్కో సభ్యుడు ఒకరిని మాత్రమే నామినేట్ చేయాలని బిగ్ బాస్ తెలిపారు. ఒక్క కెప్టెన్ బాలాదిత్య మాత్రమే ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది. అయితే రెండో వారం ఇంటి నుండి ఎలిమినేట్ కావడానికి నామినేట్ అయిన సభ్యులు.. 8 మంది.
వాళ్ళు ఎవరంటే.. రేవంత్, గీతు, ఫైమా, రోహిత్ మెరీనా, ఆదిరెడ్డి, షాని, రాజశేఖర్. వీళల్లో ఎక్కువగా రేవంత్, గీతు లకి భారీగా ఓట్లు పడ్డాయి. ఇద్దరు విషయంలో మాట తీరు కారణంగానే చాలామంది నామినేట్ చేయడం జరిగింది. మరి రెండో వారం ఈ ఎనిమిది మందిలో.. ఎవరు హౌస్ నుండి వెళ్ళిపోతారో చూడాలి. మొదటివారం ఏడుగురు నామినేట్ అయితే ఆదివారం ఎపిసోడ్ లో ఎవరిని కూడా.. పంపించకుండా నో ఎలిమినేషన్ అని అన్నారు. దీంతో బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో వారం మొట్టమొదటి ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు అన్నది ఈ వారంలో తేలనంది.
బయట నుండి అందుతున్న సమాచారం ప్రకారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ లుగా మొదటి వారంలోనే రేవంత్, ఫైమాకి వచ్చిన ఓట్లు బట్టి చెప్పవచ్చు. ఆదిరెడ్డికి కూడా బయట మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో కచ్చితంగా రెండో వారంలో రోహిత్ మెరీనా, షాని, రాజశేఖర్ ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవ్వడం గ్యారెంటీ అన్న టాక్ నడుస్తోంది.